ఇన్‌స్టాలో అస‌భ్యకర కంటెంట్‌.. రాజ్య‌స‌భ‌లో ఆందోళ‌న వ్య‌క్తం చేసిన హ‌ర్భ‌జ‌న్ సింగ్‌

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఇన్‌స్టాలో అస‌భ్యకర కంటెంట్‌.. రాజ్య‌స‌భ‌లో ఆందోళ‌న వ్య‌క్తం చేసిన హ‌ర్భ‌జ‌న్ సింగ్‌

❇️ఇన్‌స్టాగ్రామ్ లాంటి ఫ్లాట్‌ఫామ్‌పై హ‌ర్బ‌జ‌న్ తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. కొంద‌రు యూజ‌ర్లు సాఫ్ట్ పోర్నోగ్ర‌ఫీ కాంటెంట్‌ను షేర్ చేస్తున్నార‌ని, అది పిల్ల‌లకు కూడా యాక్సెస్‌లో ఉంద‌ని అన్నారు.

❇️కేవ‌లం ఒక్క క్లిక్‌తోనే అశ్లీల స‌మాచారం వ‌చ్చేస్తోంద‌ని ఆరోపించారు. 12 ఏళ్లు ఉన్న చిన్నారులు కూడా త‌మ‌కు తెలియ‌కుండానే అలాంటి అశ్లీల కాంటెంట్‌ను యాక్సిస్ చేస్తున్నార‌ని పేర్కొన్నారు. యుక్త వ‌య‌సులోనే పిల్ల‌లు ఇలాంటి కాంటెంట్‌ను చూడ‌డం వ‌ల్ల వాళ్ల భ‌విష్య‌త్తు నాశ‌నం అవుతోంద‌ని భ‌జ్జీ తెలిపారు. పోర్నోగ్ర‌ఫీ కాంటెంట్ ఈజీగా దొర‌క‌డం వ‌ల్ల ఇది తీవ్ర సామాజిక స‌మ‌స్య‌గా మారిన‌ట్లు హ‌ర్భ‌జ‌న్ పేర్కొన్నారు.