భారత్ న్యూస్ విశాఖపట్నం..నెలసరి లీవుల చట్టంతో మహిళలకే సమస్య: సుప్రీంకోర్టు
మహిళలకు తప్పనిసరిగా నెలసరి సెలవు(Menstrual Leave)లు ఇస్తే, దాని వల్ల మహిళలకే సమస్య ఉత్పన్నం అయ్యే అవకాశాలు ఉన్నాయని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ఒకవేళ బహిష్టు సమయంలో మహిళలకు లీవులు తప్పనిసరిగా ఇవ్వాలన్న చట్టాన్ని అమలు చేస్తే దాని వల్ల ఎవరు కూడా మహిళలను ఉద్యోగంలోకి తీసుకోరు అని సీజేఐ పేర్కొన్నారు. అలాంటి చట్టాలు తయారు చేయడం వల్ల పనిచేస్తున్న మహిళల్లో మానసికమైన భయాందోళనలు కలిగే అవకాశాలు ఉన్నట్లు కోర్టు తెలిపింది. పురుషుల కన్నా తాము తక్కువ అన్న భావన వారిలో కలుగుతుందని సీజే తెలిపారు. మహిళలకు నెలసరి సమయంలో కచ్చితంగా లీవులు ఇవ్వాలన్న చట్టాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించాలని న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠి తన పిటీషన్లో కోరారు. ఈ నేపథ్యంలో ఇవాళ విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసం.. అలాంటి చట్టాలతో మహిళలకే సమస్య వస్తుందని పేర్కొన్నది.
