ముంచుకొస్తున్న సూపర్‌ ఎల్‌నినో! భారీ ఎండలు, అకాల వర్షాలు : వాతావరణ శాస్త్రవేత్తల అంచనా

భారత్ న్యూస్ గుంటూరు…ముంచుకొస్తున్న సూపర్‌ ఎల్‌నినో! భారీ ఎండలు, అకాల వర్షాలు : వాతావరణ శాస్త్రవేత్తల అంచనా

ఈ ఏడాది భూగ్రహం అత్యంత శక్తిమంతమైన ఎల్‌నినో దశలో ప్రవేశించవచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఇటీవలి దశాబ్దాల్లో ఇదే అత్యంత శక్తిమంతమైనదని వారు పేర్కొంటున్నారు. సూపర్‌ ఎల్‌నినోగా పేర్కొంటున్న ఈ దశ వచ్చే జూన్‌ నుంచి ప్రారంభం కావచ్చునని అంచనా వేస్తున్నారు. సూపర్‌ ఎల్‌నినో వల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు మారవచ్చని, ఉష్ణోగ్రతలు భారీగా పెరగవచ్చని, రుతుపవనాలు అసాధారణంగా ఉండవచ్చని భావిస్తున్నారు.