పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి.

భారత్ న్యూస్ విజయవాడ…పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. గతవారం పాక్ జరిపిన వైమానిక దాడులకు నిరసనగా, అఫ్గాన్ దళాలు ప్రతీకార దాడులు ప్రారంభించాయి. ఈ దాడుల్లో సుమారు 15 నుంచి 17 పాకిస్తాన్ సైనిక అవుట్‌పోస్టులను తాము స్వాధీనం చేసుకున్నామని, 40 మంది పాక్ సైనికులను హతమార్చామని అఫ్గాన్ ప్రకటించింది. ప్రస్తుతం సరిహద్దుల్లో భారీగా కాల్పులు జరుగుతుండటంతో ఇరు దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొంది.