భారత్ న్యూస్ తిరుపతి…CCTV కారుపై పడిన కంటైనర్.. సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి
చిత్తూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. నగరంలోని ఇరువరంలో కారుపై కంటైనర్ పడింది. ఈ ప్రమాదంతో కారు నుజ్జునుజ్జయింది. దీంతో అందులో ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి అనుదీప్ అక్కడికక్కడే మృతిచెందారు. మృతుడి స్వగ్రామం గుడిపాల మండలం రామాపురం. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
