భారత్ న్యూస్ రాజమండ్రి…కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి ఆలయ హుండీ లెక్కింపు పూర్తి
పల్నాడు జిల్లా లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కోటప్పకొండలోని శ్రీ త్రికోటేశ్వరస్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు కార్యక్రమం బుధవారం నిర్వహించారు. 82 రోజుల కాలానికి సంబంధించిన హుండీ ఆదాయం మొత్తం రూ.59,97,462గా నమోదైంది.
దీనిలో నగదు రూపంలో రూ.58,77,452, అన్నదానానికి ప్రత్యేకంగా రూ.1,20,010 లభించినట్లు అధికారులు తెలిపారు. అదనంగా భక్తులు సమర్పించిన వెండి 106 గ్రాములు, బంగారం 2 గ్రాములు 900 మిల్లీగ్రాములు

విదేశీ కరెన్సీ రూపంలో 40 అమెరికా డాలర్లు, 100 కెనడా డాలర్లు, 5 యూరోలు, 20 నేపాల్ నోట్లను కూడా లెక్కింపులో గుర్తించినట్లు ఈవో చంద్రశేఖరరావు తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమం భక్తుల సమక్షంలో పారదర్శకంగా నిర్వహించినట్లు దేవస్థానం అధికారులు పేర్కొన్నారు