భారత్ న్యూస్ అనంతపురం .. .దేశం కోసం సైనికులను ఇచ్చిన వీర మాతలకు వందనం…
కదన రంగనికి కొదమ సింహలను ఇచ్చిన తల్లులకు వందనం…
దేశం కోసం ఫిరంగులై గర్జిస్తున్న
కల్నల్ సోఫియా ఖురేషి…
కమాండర్ వ్యోమికా సింగ్ లను అందించిన మాతృ మూర్తులకు వందనం…
మీ నెత్తుటి మరకలు భూతల్లి గర్భంపై పడితే…
సిందూరంగా అద్దుకుంటాం…
మీ గాయలైన దేహాలను ఓడిలోకి చేర్చుకుంటాం…
యుద్ధ భూమిలో వీర మరణం పొందిన అమర సైనికులను…
మా గుండెలకు హత్తుకుంటాం…
త్రివర్ణ పతాకంలో కనుల నిండా చూసుకుంటాం….
ఓ భారత మాత నీకు వందనం…