South Central won seven awards at the national level under the title of “Most Distinguished Rail Service Award –

భారత్ న్యూస్ హైదరాబాద్,

జాతీయ స్థాయిలో “అతి విశిష్ట రైలు సేవ పురస్కార్ – 2023” పేరిట ఏడు అవార్డులు సాధించిన దక్షిణ మధ్య రైల్వే సిబ్బంది.

  • ఈ అవార్డులు 15 డిసెంబర్ 2023 న గౌరవనీయులైన రైల్వే మంత్రి చేతుల మీదుగా న్యూఢిల్లీలో ప్రధానం జేయబడతాయి దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగులు “అతి విశిష్ట రైలు సేవ పురస్కార్ – 2023” పేరిట ఏడు అవార్డులను సాధించడం ద్వారా జోన్ మరోసారి జాతీయ స్థాయిలో సత్తా చాటుకుంది. వారికి ఈ అవార్డులను 15 డిసెంబర్ 2023 న న్యూఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి కార్యక్రమంలో గౌరవనీయులైన రైల్వే మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ చేతుల మీదుగా ప్రదానం చేయబడుతాయి.
    అవార్డులు పొందిన ఏడుగురు ఉద్యోగుల వివరాలు ఈ క్రింద విధంగా ఉన్నాయి .
  1. శ్రీ డిఎస్ రామారావు , డిప్యూటీ చీఫ్ ఇంజనీర్, కన్స్ట్రక్షన్, కాజీపేట , దక్షిణ మధ్య రైల్వే.

కాజీపేట – బల్హర్షా మధ్య వివిధ సెక్షన్ ల లో మూడవ లైన్ పనులను పూర్తి చేసి ప్రారంభించే సమయములో 9 యార్డ్ ల ప్రధాన పునర్నిర్మాణంలో మరియు నాన్ ఇంటర్‌లాకింగ్ సమయంలో 245 టర్న్‌అవుట్‌లు చొప్పించబడడంలో /తొలగించబడడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. విజయవాడ – కాజీపేట సెక్షన్‌లోని కొండపల్లి మరియు నార్త్ వెస్ట్ బ్లాక్ హట్ మధ్య 3 వ లైన్ పనులను పూర్తి చేసి ప్రారంభించడంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన ఆద్వర్యంలో మానేర్ నది మీదుగా ఒక ముఖ్యమైన వంతెన నెం. 66 రికార్డు సమయంలో పూర్తి చేశారు. 3 వ లైన్ యొక్క అన్ని నాన్ ఇంటర్‌లాకింగ్ పనులు సమర్ధవంతంగా ప్రణాళికతో సాధ్యమైనంత తక్కువ వ్యవధిలో వేగ పరిమితులను జాగ్రత్తగా సడలించి పనులు ప్రారంభించి పూర్తిచేయడం జరిగింది. అతని అంకితభావం, కృషి, ఖచ్చితమైన ప్రణాళిక మరియు సమర్ధవంతమైన పని కారణoగా, కీలకమైన విభాగాలలో లక్ష్యాల ప్రకారం మూడవ లైన్ పనులను ప్రారంభించి, దక్షిణ మధ్య రైల్వే చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా మూడవ లైన్ పనులను పూర్తి చేసి ప్రారంభించగలిగారు .

  1. సి. ఎచ్. దినేష్ రెడ్డి, సీనియర్ డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, ట్రాక్షన్ రోలింగ్ స్టాక్, ఎలక్ట్రిక్ లోకో షెడ్, విజయవాడ, దక్షిణ మధ్య రైల్వే
    విజయవాడలోని ఎలక్ట్రిక్ లోకో షెడ్కు ఇన్చార్జిగా ఉన్నారు. అవాంతరాలు లేని రైలు కార్యకలాపాలను నిర్ధారించడానికి, లోకోమోటివ్ల భద్రత మరియు విశ్వసనీయతను మెరుగుపరచడంపై ఆయన దృష్టి సారించారు. ఆయన సాంప్రదాయ లోకోమోటివ్లలో”ట్రాక్షన్ మోటార్ డ్రాపింగ్ డిటెక్షన్ సిస్టమ్ (టి.ఎమ్.డి డి.ఎస్.)”ను రూపొందించి అమలు చేశారు. డబ్లు.ఏ.పి4 లోకోమోటివ్లలో “కవచ్” ఆన్-బోర్డ్ పరికరాలను అమర్చడంలో కూడా వారు కీలక పాత్ర పోషించారు. విజయవాడలోని ఎలక్ట్రిక్ లోకో షెడ్లో 3 ఫేజ్ లోకో నిర్వహణ సజావుగా ప్రారంభించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
  2. శ్రీ మల్లెల శ్రీకాంత్ , డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్ / సికింద్రాబాద్ / దక్షిణ మధ్య రైల్వే ( ప్రస్తుతం రైల్వే బోర్డ్ లో డిప్యూటీ డైరెక్టర్ / ఫ్రైట్ & ఫెర్టిలైజర్ ).
    శ్రీ మల్లెల శ్రీకాంత్, డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్ గా ఎస్.ఎమ్.ఎస్.ల ద్వారా ఆటోమేటెడ్ హెచ్చరికలతో మొబైల్ ఆధారిత ప్లాట్‌ఫారమ్ ద్వారా రైలు ఈవెంట్‌ల డిజిటల్ ప్రసారాన్ని అభివృద్ధి చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. దీనిద్వారా సైడింగ్‌ల వద్ద లోడింగ్ స్థితి గతులను గుర్తించడంలో మరియు సరుకు రవాణా రైళ్లను వాస్తవ సమయములో పర్యవేక్షణ చేయడంలో సహాయపడింది తద్వారా సరుకు రవాణా రైళ్లను సకాలములో నడపడానికి దోహదంచేసింది. ఆయన భారతీయ రైల్వేలో జీరో బేస్డ్ టైమ్ టేబుల్‌ని అభివృద్ధి చేయడంలో పాల్గొన్న బృందంలోకూడా కీలక పాత్రను పోషించారు. బాక్స్ఎన్ వ్యాగన్ల లోపాలను గుర్తించడంలో సహాయపడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కెమెరా సిస్టమ్‌ను అమలు చేయడంలో కూడా భాగమయ్యారు. దీనితో పాటు , ఆయన రైలు ద్వారా క్లిష్టమైన మందులు మరియు అవసరమైన వస్తువుల తరలింపును సులభతరం చేసే ప్రధాన బృందంలో కూడా ఉన్నారు. ఆయన పార్శిల్ ఛార్జీల కాలిక్యులేటర్ ను అభివృద్ధి చేయడమేకాకుండా రైల్ యాత్రి సేవా అప్లికేషన్ కోసం బ్లూ ప్రింట్‌ను కూడా అభివృద్ధి చేశారు.
  3. శ్రీ సి శివకుమార్ కశ్యప్ , డివిజనల్ సిగ్నల్ మరియు టెలికమ్యూనికేషన్ ఇంజనీర్, సికింద్రాబాద్ :
    దక్షిణ మధ్య రైల్వే చేపట్టిన కవచ్ ప్రాజెక్టుల పూర్తికి శ్రీ సి. శివ కుమార్ విశేష కృషిని అందించారు. దక్షిణ మధ్య రైల్వేలోని హైదరాబాద్ మరియు గుంతకల్ డివిజన్లలో 500 కంటే ఎక్కువ రూట్ కిలోమీటర్ లలో కవచ్ విస్తరణలో కీలక పాత్రను పోషించారు. “డైరెక్ట్ ఈ కవాచ్” ఇంటర్‌ఫేస్ విస్తరణలో కూడా ఆయన కీలక పాత్రను పోషించారు, తద్వారా 13 రూట్ కిలోమీటర్ల యొక్క ఆటో సెక్షన్‌తో సహా 100 రూట్ కిలోమీటర్ల కవర్ చేసే 10 స్టేషన్‌లలో కవ చ్ యొక్క త్వరిత విస్తరణకు దారితీసింది. దీనితోపాటు ఆయన దాదాపు 25 ప్రదేశాలలో కవచ్‌లో తలెత్తిన పరిణామాల యొక్క కఠినమైన పనిని చేపట్టి విజయవంతంగా పూర్తి చేశారు .
  4. శ్రీమతి టి.ప్రత్యూష మహిళా సబ్-ఇన్స్పెక్టర్, రైల్వేరక్షక దళం , నిజామాబాద్ :
    ఆమె నిజామాబాద్ లోని రైల్వేరక్షక దళంలో సబ్-ఇన్స్పెక్టర్ గా పనిచేస్తూ హత్య కేసులో ఇద్దరు నేరస్థులను పట్టుకోవడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఒక హత్య కేసు మరియు ఒక అత్యాచారం కేసును గుర్తించడంలో ఆమె ప్రధాన పాత్రను పోషించడమెకాకుండా మానవ అక్రమ రవాణాలో పాల్గొన్న నేరస్థులను గుర్తించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఆమె ప్రయాణీకుల వస్తువులను దొంగిలించిన ఒక నేరస్థుడిని కూడా పట్టుకుని రూ. 1.25 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు .