The state government has strangled the opposition

భారత్ న్యూస్ హైదరాబాద్,

మాజీ మంత్రి టి .హరీష్ రావు ప్రెస్ మీట్ @మీడియా పాయింట్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షం గొంతు నొక్కింది

ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఖూనీ చేసింది

నిరసనకు కూడా అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం పారిపోయింది

ఎం.ఐ.ఎం, బీజేపీలకు అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం భయపడింది

సీఎం రేవంత్ రెడ్డి గోబెల్స్,అబద్దాలను సభలో చెప్పారు

రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం సీఎం చేశారు

పాయింట్ ఆఫ్ ఆర్డర్ అడిగినా మాకు అవకాశం ఇవ్వలేదు

మూడు నిమిషాల్లో మూడు సార్లు మైక్ కట్ చేశారు

తమ తప్పులు బయటపెడతామని ప్రభుత్వం పారిపోయింది

కాంగ్రెస్ పార్టీ నేపధ్యం కుటుంబ నేపధ్యం

విదేశీయురాలు సోనియాగాంధీ ని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలుగా చేశారు

పీ.వీ.నరసింహారావును అవమానించింది కాంగ్రెస్ పార్టీ

ఢిల్లీలో పీ.వీ.నరసింహా రావుకు గుంటడు జాగా ఇవ్వలేదు

తెలంగాణ బిడ్డ టంగుటూరు అంజయ్యను మాజీ ప్రదాని రాజీవ్ గాంధీ అవమానించారు

బిఆర్ఎస్ అధికారంలో వున్నప్పుడు ప్రతి సంవత్సరం అమరవీరులను స్మరించుకున్నాము

కానిస్టేబుల్ కృష్ణయ్య కూతురుని డాక్టర్ చదివించింది బిఆర్ఎస్ ప్రభుత్వం

తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడే హక్కు రేవంత్ రెడ్డికి లేదు

ఉద్యమంలో రైఫీల్ పట్టుకుని రేవంత్ రెడ్డి తిరగలేదా

ఈ రోజుకు మా మీద తెలంగాణ ఉద్యమ కేసులు వున్నాయి

అనేక ఉద్యమకారుల కేసులను బిఆర్ఎస్ ప్రభుత్వం మాఫీ చేసింది

మాకు క్లారిఫికేషన్ కోసం సభలో మైక్ ఇవ్వలేదు

తెలంగాణలో 6.59 శాతంతో వ్యవసాయ రంగంలో దేశంలో రెండవ స్థానంలో నిలిచింది

వ్యవసాయ వృద్ధి రేటులో తెలంగాణ అభివృద్ధి ఘనత బిఆర్ఎస్ పార్టీదే

కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వరి ధాన్యం 24 లక్షల మెట్రిక్ టన్నులు అయితే బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కోటీ 20 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాము

మిరప పంటలో తెలంగాణ మొదటి స్థానంలో వుంది

ప్రత్తి పంటలో దేశంలో రెండవ స్థానంలో తెలంగాణ వుంది

తెలంగాణలో రైతు ఆత్మహత్యలు తగ్గాయి