The people of Telangana wanted to be freed from the ten years of restrictive regime and wanted to see

భారత్ న్యూస్ హైదరాబాద్,

పదేళ్ల నిర్బంధపు పాలన నుండి విముక్తి కావాలని, తమ బతుకుల్లో గొప్ప మార్పు రావాలని కోరుకున్న తెలంగాణ ప్రజలు ఇటీవల ఎన్నికల్లో ఆ దిశగా సుస్పష్టమైన తీర్పు ఇచ్చారు. వారి విజ్ఞతను నేను అభినందిస్తున్నాను. నా ప్రభుత్వంలో తెలంగాణ స్వేచ్చావాయువులను పీల్చుకుంటోంది. నియంతృత్వ పాలన, పోకడల నుండి తెలంగాణ విముక్తి పొందింది. నిర్బంధాన్ని సహించబోమని విస్పష్టమైన ప్రజాతీర్పు ద్వారా చెప్పింది. ఈ తీర్పు పౌరహక్కులకు, ప్రజాస్వామ్య పాలనకు నాంది అయ్యింది. పాలకులకు, ప్రజలకు మధ్య ఉన్న ఇనుప కంచెలు తొలిగిపోయాయి. అడ్డుగోడలు, అద్దాల మేడలు పటాపంచలై.. ప్రజా ప్రభుత్వ ప్రస్థానం మొదలైందని చెప్పడానికి గర్విస్తున్నాను.
-రాష్ట్ర గవర్నర్ డా.తమిళిసై సౌందరరాజన్