K. Narayana criticized KTR who is troubled because he did not get the post of CM

….Bharathnews.hyd,,

ఓటమి భయంతోనే ‘ఇండియా కూటమి’ని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బలహీనపర్చేందుకు ప్రయత్నిస్తోందని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ విమర్శించారు. ఇండియా కూటమిలో కీలక పాత్ర పోషించిన బిహార సిఎం నితిష్ కుమార్ ‘కక్కిన కూడు తినేందుకే’ తిరిగి ఎన్ డిఎ కూటమిలోనికి వెళ్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటి వరకుఎన్ డిఎకు వ్యతిరేకం ఉండి, ఇండియా కూటమిలో ఉన్నవారు తిరిగి ఎన్డిఎ కు వెళ్లేవారు ‘కక్కిన కూడు తినేందుకే’నని వ్యాఖ్యానించారు. సిపిఐ జాతీయ సమితి సమావేశాలు ఫిబ్రవరి 2,3 మరియు 4 తేదీల్లో హైదరాబాద్ లో జరగనున్నాయని తెలిపారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి, పశ్యపద్మ, ఈ.టి. నర్సింహతో కలిసి హైదరాబాద్ మఖ్ధూంభవన్ ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నారాయణ మాట్లాడుతూ మోడీ పదేళ్ల కాలంలో సాధించింది ఏమీ లేదని, అందుకే ‘శ్రీరాముని’ పేరుతో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కేంద్రంలోని బిజెపిది ‘మోస్ట్ క్రిమినల్ గవర్నమెంట్’ అని విమర్శించారు. ఒక న్యాయనిపుణుడే కూడా క్రిమినల్ గవర్నమెంట్ అని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
ముందస్తు ప్రణాళిక ప్రకారమే లోక్ ఎన్నికల నోటిఫికేషన్ ముందే మోడీ ప్రభుత్వం అయోధ్య రామలయాన్ని ప్రారంభించేందుకు ప్రణాలిక రూపొందించుకున్నదని, ఆలయం పూర్తికాకపోయినా ఆలయాన్ని ప్రారంభించారని విమర్శించారు. ఆలయ ప్రారంభం రోజు ఏమైనా జరుగొచ్చని, అగ్నిగుండం బద్దలు కావొచ్చంటూ చాలా మందిని బిజెపి నేతలు భయబ్రాంతుకలు గురిచేశారని, చివరకు ఆ రా్రష్ట్ర సిపిఐ కార్యదర్శిని కూడా అక్కడి నుండి వెళ్లిపోవాలని చెప్పినట్టు నారాయణ గుర్తు చేశారు. కేజ్రీవాల్ పాటు జార్ఖండ్ సిఎంకు నోటీసులు జారీ చేశారని, ఒక్కో ఎంఎల్ రూ.25 కోట్లతో ఇచ్చేందుకు బిజెపి సిద్ధమవుతున్నదని, డబ్బులు, అధికారాన్ని ఉపయోగించి దర్యాప్తు సంస్థలను ప్రయో గిస్తున్నారన్నారు.ని తెలిపారు.
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో రాముని పేరు చెప్పి ప్రజలను ఓటు అడగాలా?, లేదా పదేళ్ల కాలంలో చేపట్టిన కార్యక్రమాలను చూపి ఓటు అడగాలా? అని బిజెపిలో ఉన్న పెద్ద ప్రశ్న అని, బిజెపి పదేళ్ల కాలంలో ప్రభుత్వ రంగ సంస్థలను. నీటి పారుదల ప్రాజెక్ట్ కొత్తగా తీసుకురాలేదని, పైగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేశారని విమర్శించారు. పార్లమెంటరీని ప్రధాని మోడీ ముద్దు పెట్టుకున్నప్పటి నుండి పార్లమెంటరీ వ్యవస్థను ద్వంసం చేస్తూ వస్తున్నారని మండిపడ్డారు. దేశాన్ని విచ్చిన్నం చేసేందుకు మోడీ ప్రతిజ్ఞ చేసినట్టుగా కనిపిస్తోందన్నారు.

దేశం ‘తెలంగాణ కాంగెస్ కూటమి’ అనుసరించండి
వచ్చే లోక్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విశాల దృక్ఫథంతో ఉండాలని నారాయణ సూచించారు.దేశ వ్యాప్తంగా ఉన్న చిన్న, పెద్ద రాజకీయా పార్టీలను కలుపుకుని ముందుకు సాగాలని, అప్పుడే ప్రమాదకరమైన ప్రధాని మోడీని ఎదుర్కొనేందుకు అవకాశం ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సిపిఐతో సహా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలను కలుపకుని పోవడంతోనే మంచి ఫలితాలు వచ్చాయని గుర్తు చేశారు. దీనిని దేశ వ్యాప్తంగా అనుసరించాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో వరంగల్, నల్లగొండ, భువనగిరి, ఖమ్మం, పెద్దపల్లి నియోజకవర్గాలపై చర్చించి ,జాబితాను సిద్ధం చేశామని పునరుద్ఘాటించారు. గత పాత ప్రభుత్వంలో అన్యాయం జరిగినవారికి న్యాయం చేయాలని నారాయణ కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. సిపిఐ జాతీయ సమావేశాలకు జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, జాతీయ నాయకులు అమర్ కౌర్, సిపిఐ రాజ్యసభ పక్ష నాయకుడు బినయ్ విశ్వంతో పాటు జాతీయ నాయకులు హాజరుకానున్నట్టు నారాయణ తెలిపారు. దేశంలో రాజకీయాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో సిపిఐ జాతీయ సమితి సమావేశాలు జరగడం ప్రాముఖ్యత సంతరించుకున్నదన్నారు. ఈ సమావేశంలో స్పష్టమైన వైఖరి తీసుకుంటామన్నారు.

బిజెపికి అనుకూలంగా జగన్, బాబు
ఆంధ్రప్రదేశ్ సిఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు బిజెపికి అనుకూలంగా ఉన్నారని నారాయణ అన్నారు. జగన్ కోడి కత్తి, బాబుపైన 17ఎ కేసులు పెంగిండ్ ఉన్నాయని, కేంద్రంలోని బిజెపి న్యాయస్థానాల ద్వారా బెదిరింపులకు పాల్పడుతోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్న ధైర్యం చంద్రబాబుకు లేదా , 17ఎ కేసు ఉంటే ఉండని, ధైర్యంతో ఎందుకు నిలబడడం లేదని నారాయణ ప్రశ్నించారు.

సిఎం పదవి రానందుకే ఇబ్బందిపడుతున్న కెటిఆర్
బిఆర్ ప్రభుత్వం నిర్మించిన సచివాలయం తరహా భవనాలు కెసిఆర్ అనుభవించలేకపోయారని నారాయణ ఎద్దేవా చేశారు. ఆహాంబావం, అసహానం పెరిగిందని, రాజకీయాల్లో అవినీతి అసహానం పెరిగితే మంచిది కాదని హితువు పలికారు. బిఆర్ నేతలు అసంబద్ధంగా మాట్లాడుతున్నారని, ప్రభుత్వంపైన శాపనార్థాలు పెట్టడంంతో వారి కుల్లు బుద్ది భయపడుతుందన్నారు. తానే ముఖ్యమంత్రి అవుతానని కెటిఆర్ అనుకున్నారని, సిఎం పదవి రాకపోయే సరికే ఆయన ఇబ్బంది పడుతున్నారని ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. కోదండరామ్ ఎంఎల్ రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడేలా, అభివృద్ధి చేసే క్రమంలో వ్యాపారం చేస్తే తమకు అభ్యంతరం లేదని, రాష్ట్రాన్ని అమ్మె పద్ధతి పట్లనే తమకు అభ్యంతకరమని రాష్ట్రంలో అదాని పెట్టుబడులనుద్దేశించి ఒక ప్రశ్నకు నారాయణ సమాధానం చెప్పారు.