Sangareddy District Police Department for the welfare of R.O. Water plant, new police barber shop

భారత్ న్యూస్ హైదరాబాద్,

సిబ్బంది వెల్ ఫేర్ విషయంలో ముందుంటాం..
• సంగారెడ్డి జిల్లా పోలీసు శాఖ సంక్షేమార్ధమై ఆర్.ఒ. వాటర్ ప్లాంట్, నూతన పోలీసు బార్బర్ షాప్ లను ఓపెనింగ్ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ చెన్నూరి రూపేష్ ఐ.పి.యస్ గారు.
ఈ రోజు తేది: 16.12.2023 నాడు, జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం సంగారెడ్డి నందు జిల్లా ఎస్పీ గారు.. సిబ్బంది సంక్షేమార్ధమై ఆర్.ఒ. వాటర్ ప్లాంట్, నూతన బార్బర్ షాప్ లను ఓపెన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ.. ఈ వాటర్ ప్లాంట్ ద్వారా జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో గల అన్ని విభాగాలకు వాటర్ అంధించడంతో పాటు, సిబ్బంది తమ ఇండ్లకు తీసుకొని వెళ్ళడానికి వీలుగా ఉంటుందన్నారు. ఈ సౌకర్యం పట్టణ ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుందన్నారు. అనంతరం ఎ.ఆర్. హెడ్ క్వార్టర్స్ నందు సిబ్బంది శ్రేయస్సు కోసం పోలీసు బార్బర్ షాప్ ను ఓపెన్ చేయడం జరిగిందని అన్నారు. సిబ్బంది ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రానున్న రోజుల్లో సూపర్ మార్కెట్ ను తలపించేలా పోలీసు క్యాంటీన్ (కామధేనువు) ను ఓపెనింగ్ చేసుకోవడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ డా.పి.అశోక్, జనార్ధన్ ఎ.ఆర్.డిఎస్పీ, ఆర్.ఐ.లు రాజశేఖర్ రెడ్డి, రామరావ్, హన్మి రెడ్డి, శివలింగం ఇన్స్పెక్టర్, మహేష్ గౌడ్, విజయ్ కృష్ణ ఇన్స్పెక్టర్స్ తదితరులు పాల్గొన్నారు.
గమనిక:- పోలీసు సిబ్బంది, పట్టణ ప్రజలకు రెండు రోజుల పాటు అనగా ఈ రోజు, రేపు పోలీసు ఆర్.ఒ. వాటర్ ప్లాంట్ ద్వారా ఉచితంగా నీళ్ళు అంధించడం జరుగుతుందని, తేది 18.12.2023 నాటి నుండి రూ.5/- చెల్లించి ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని తెలియజేయడం జరుగుతుంది.