మిషన్ భగీరథ నిర్వాహణ సంస్థలతో పంచాయతీ రాజ్ సెక్రెటరీ సమావేశం

మిషన్ భగీరథ నిర్వాహణ సంస్థలతో పంచాయతీ రాజ్ సెక్రెటరీ సమావేశం
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి , PR&RD మరియు RWS, శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా, IAS ధి 06.04.2024, ఇంజనీర్-ఇన్-చీఫ్, మిషన్ భగీరథ శాఖ శ్రీ. జి. కృపాకర్ రెడ్డి మరియు ఇతర చీఫ్ ఇంజనీర్లు, సుపెరింటెండింగ్ ఇంజనీర్స్, మిషన్ భగీరథ O&M పంప్ సెట్స్ మరియూ సివిల్ ఏజెన్సీలైన మేఘా ఇంజనీరింగ్, రాఘవ కన్స్ట్రక్షన్స్, ఎన్ సి సి, ఎల్ అండ్ టి, ఐ‌హెచ్‌పి, కోయ అండ్ కంపెనీ.,ప్రతిభ ఇండస్ట్రీస్, జి‌వి‌పి‌ఆర్, కే‌ఎల్‌ఎస్‌ఆర్ మొదలైన సంస్తలతో నీటి సరఫరా మరియూ నిర్వహణ పై సమీక్షా సమావేశాన్ని మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు.

ఈ ఏడాది వర్షాభావ పరిస్తితుల కారణంగా వేసవిలో నీటి సరఫరా చాలా కీలకమని, అన్ని గ్రామీణ ఆవాసాలలోని ప్రతి ఇంటికి తాగునీటిని సరఫరా చేయడం శాఖ బాధ్యత అని ప్రిన్సిపల్ సెక్రటరీ గుర్తు చేశారు. పంపు సెట్‌లలో లేదా పైప్‌లైన్‌లో లేదా విద్యుత్ సరఫరాలో ఏదైనా చిన్న మరమ్మత్తు కానీ వైఫల్యం కానీ సంభవించినట్లైతే  కొన్ని ఆవాసాలకు సరఫరా ఇబ్బంది కలిగే అవకాశముంది. గృహాలకు నిరవధికంగా మరియు 100% సరఫరా చేయడానికి O&M ఏజెన్సీ  సమర్థవంతంగా నిర్వహించడం చాలా ముఖ్యమైనది మరియు కీలకమని  గుర్తు చేశారు.

అన్ని పంపు సెట్ల మరమ్మతులను ఏప్రిల్ 12 నాటికి పూర్తి చేయాలని నిర్దేశించారు. ఈ విషయంలో పంప్ సెట్స్ ఏజెన్సీలు తక్షణమే కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి, సంబంధిత చీఫ్ ఇంజనీర్‌లకు సమర్పించాలి. అలాగే ఏజెన్సీలు పంపు సెట్స్ సంబందించిన స్పెరు పార్టులను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు.పైప్‌లైన్ మరమ్మతులన్నింటిని 12 గంటల్లో హాజరు కావాలని ప్రిన్సిపల్ సెక్రటరీ, ఓ అండ్ ఎం ఏజెన్సీలకు నిర్దేశించారు. 

డిపార్ట్‌మెంట్ నిర్దేశించిన సమయానికి తాము ఖచ్చితంగా కట్టుబడి ఉంటామని, ప్రస్తుతం ఉన్న మరమ్మతులకు, భవిష్యత్తులో జరిగే మరమ్మతులకు సానుకూలంగా హాజరవుతామని ఏజెన్సీలు హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యాత్మక ఆవసాలను గుర్తించి వాటిపై ప్రత్యేక శ్రద్దవహించి ప్రతిరోజూ నీటి సరఫరా అయ్యేటట్టు చూడాలని సంబదిత చీఫ్ ఇంజనీర్లును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించడం జరిగింది.