రాష్ట్ర పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్, ఆర్డబ్ల్యూఎస్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ సుల్తానియా

భారత్ న్యూస్ హైదరాబాద్..

రాష్ట్ర పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్, ఆర్డబ్ల్యూఎస్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ సుల్తానియా
జిల్లాలోనీ త్రాగునీరు సరఫరా పై జిల్లా కలెక్టరు, జిల్లా అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ సుల్తానియా మాట్లాడుతూ వేసవి కాలంలో నీటి వినియోగం పెరిగి త్రాగునీటి వనరులు తగ్గిపోతాయి. ఇలాంటి సమయంలో ప్రజా అవసరాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రజలకు త్రాగునీటి సమస్య రాకుండా ముందస్తు ప్రణాళిక ప్రకారం జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. సిద్దిపేట జిల్లాలో అవసరమైన త్రాగునీటి వనరులు అందుబాటులో ఉన్నయని, అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాలో ఎలాంటి త్రాగునీటి సమస్య రాకుండా, గ్రామాల వారిగా యాక్షన్ ప్లాన్ చేసి కొత్త హాబిటేషన్లలో కూడా త్రాగునీరు అందించే విధంగా చల్లలు చేపట్టాలన్నారు. ఒక నెల స్పెషల్ డ్రైవ్ ద్వారా అన్ని గ్రామాలలో బోర్లు, చేతిపంపులను ప్రిపేర్ చేసి ఏదైనా త్రాగునీటి సరఫరాకు ఇబ్బంది వస్తే ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని అధికారులకు తెలియజేశారు. పాతకాలంలో లాగా బోర్లు, చేతి పంపులు, స్థానిక నీటి వనరుల ద్వారా త్రాగునీటి సరఫరా చేయడం కాకుండా మన రాష్ట్రంలో వందల కిలోమీటర్ల గ్రిడ్ వాటర్ పైపులైన్, ఇంట్రా విలేజ్ పైప్లైన్ వ్యవస్థ ఇంటిగ్రేటెడ్ గలదు. ఏదైనా సమస్య వస్తే గ్రిడ్ మరియు ఇంట్రా ఇంజనీర్లు కలిసి పరిష్కరించాలన్నారు. ప్రత్యామ్నాయ లోకల్ రిసోరస్సాస్ అందుబాటులో ఉంచుకోవలన్నరు. మండల ప్రత్యేక అధికారులు అన్ని గ్రామాలను విసిట్ చేసి ఎక్కడైనా త్రాగునీటి సమస్యను గుర్తిస్తే రిపేర్ చేయించడం, అవసరమైతే ప్రత్యామ్నాయంగా నీటి సరఫరాకు చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రతి గ్రామపంచాయతీలో మండల ప్రత్యేక అధికారి, ఎంపీడీవో, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ల ఫోన్ నెంబర్లను పోస్టర్ల ద్వారా ప్రదర్శించి ఏదైనా సమస్య వస్తే ఫోన్ చేసేలా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.

అనంతరం జిల్లాలోని గజ్వె్ల్ మండలం అక్కారం 40 ML సంప్ మరియు ఇంటర్మీడియేటరీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, కుకునూరుపల్లి మండలం తిప్పారం మల్లన్న సాగర్ రా వాటర్ పంపు హౌస్, మంగోల్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, కొండపాక ఇంటిర్మిడియేటరీ పంపు హౌస్ లను జిల్లా కలెక్టర్ ఎం మనుచౌదరి, ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సి కృపాకర్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్ విజయ్ ప్రకాష్ లతో కలిసి పరిశీలించారు.

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎం మనుచౌదరి, ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సి కృపాకర్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్ విజయ్ ప్రకాష్, తదితర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

  జిల్లా పౌర సంబంధాల అధికారి సిద్దిపేట జిల్లా గారిచే జారీ చేయనైనది