Mohammed Nasim Haimad of Reddy Colony in Hanmakonda district has two boys.

భారత్ న్యూస్ హైదరాబాద్,

హన్మకొండ జిల్లాలోని రెడ్డి కాలనీకి చెందిన మహమ్మద్ నసిమ్ హైమద్ దంపతులకు ఇద్దరు అబ్బాయిలు. చిన్న అబ్బాయి ఎండీ ఆదిల్ హైమాద్ కు కొంత కాలంగా బొన్ క్యాన్సర్ తో బాధ పడుతున్నారు.. లక్షలలో వైద్యం చేయించలేక పేదరికంతో బాధపడుతున్న ఆ కుటుంబం మంత్రి కొండ సురేఖ కు కలిసి వారి భాదను విన్నవించారు.. చలించిపోయిన మంత్రి కొండ సురేఖ వెంటనే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చి సమస్య తీవ్రతను తెలియజేశారు.. వెనువెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంబంధిత అధికారులకు చెప్పి వారికి అయ్యే ఖర్చు ప్రభుత్వం భరిస్తుంది అని హామీ ఇచ్చారు.. పేద ప్రజల వైద్యానికి మన ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఆపదలో ఉన్న రోగులను ఆదుకునేందుకు అన్ని విధాల అండగా ఉంటామని మంత్రి అన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా మన ప్రభుత్వం పని చేస్తుందని ఆర్ధిక స్థోమత కారణంగా ఎవరు దిగులుపడవద్దు వారికి మన ప్రజా ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి అండగా వున్నారు అని మంత్రి సురేఖ అన్నారు.
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేద ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందాన్నారు.. ప్రజా వైద్య సమస్యల దృష్ట్యా ఆరోగ్య శ్రీ 5 లక్షల నుండి 10 లక్షల వరకు పెంచిన ఘనత మన ప్రభుత్వం కు దక్కుతుంది అని అటవీశాఖ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.