Conducted motivational classes in Palnadu Seema. PVP Anjani Kumari.

భారత్ న్యూస్ హైదరాబాద్,

పల్నాడు సీమ లో ప్రేరణా తరగతులు నిర్వహించిన. పి.వి.పీ.అంజనీ కుమారి గారు.
(తెలంగాణ సి.ఎస్ .సి కోర్టు సీనియర్ సూపరింటెండెంట్ పి.వి.పి అంజని కుమారి) కలాం విజన్ మరియు యువతేజం ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఎస్ కె కరీముల్లా గారు, అనంతపురము మహాత్మా జ్యోతి బా పూలే బాలికల గురుకుల విద్యాలయం ప్రిన్సిపల్ డాక్టర్ సి. నారాయణ స్వామి తిరుపతి నుండి విచ్చేసిన సాప్ట్ వేర్ ఇంజనీర్ అనిల్ పల్నాడు జిల్లా మాచర్ల ప్రాంతం లో వెలసిన సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహము లోను మాచర్ల లోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయం లోను వెల్దుర్తి లోని గిరిజన బాలికల గురుకుల పాఠాశాలలోను శిరిగిరిపాడు లోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల లోను మరియు ఎత్తిపోతల లోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలోని
విద్యార్థినులకు ముఖ్యంగా పదవ తరగతి చదువుతున్న విద్యార్థినులకు ప్రేరణా తరగతులను ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా అంజనీ కుమారి మాట్లాడుతూ పబ్లిక్ పరీక్షలు అత్యంత సమీప కాలంలో వస్తూన్న కారణంగా విద్యార్థినులు ఎంతో ఏకాగ్రతతో అంకితభావంతో దృడదీక్షతో ఉన్నత లక్ష్యాలతో తమ గమ్యాన్ని చేరుకునే వరకు అలుపెరుగక పరిశ్రమించాలనిt
తెలియజేశారు APJ అబ్దుల్ కలాం గారు తెలిపినట్లు ప్రతి ఒక్కరూ కలలు కనాలని ఆ కలలకు పేదరికం ఉండకూడదని అవి నేర వేరే వరకు అవిశ్రాంతంగా పరిశ్రమించాలని తెలియజేశారు పదవ తరగతి చారా కీలకమైందని జీవితoలో ప్రతి ఒక విద్యార్థికి ఇదొక మలుపు అని పదవ తరగతి అయిపోగానే ప్రతి ఒక్కరూ కళ్యాణమండపాల వైపు గాక కళాశాలల వైపు నడక సాగించాలని మంచి ఉద్యోగాన్ని తద్వారా మంచి వేతనాన్ని పొంది నప్పుడే ఆర్థిక స్వావలంబనతో తమ బ్రతుకు సువర్ణ మయం కాగలదని తెలియజేశారు మరియు ఎటు వంటి కష్టాలు ఎదురైనా ఆడబిడ్డలు ఆత్మ స్థైర్యంతో ముందుకు అడుగు వేయాలని
ఆ ఆత్మ శక్తే తమకు శ్రీరామ రక్ష గా నిలుస్తుoదని తెలియ జేశారు మరియు కలాం విజన్ మరియు యువ తేజం వ్యవస్థాపక అధ్యక్షులైన డాక్టర్ ఎస్ కె కరీముల్లా గారు మాట్లాడుతూ దేశ భవిష్యత్తు అసెంబ్లీ హాలుల్లోనో పార్లమెంట్ భవనాలల్లోనో కాక తరగతి నాలుగు గోడల మధ్యే నిర్మాణ మౌతుoదని అట్టి భావిభారత నిర్మాతలు కొలువున్న తరగతి ని తమ రక్షణలో శిక్షణలో సంరక్షణ లో సౌభాగ్యవంతం చేసుకోవాలని తరగతి లోని ప్రతి విద్యార్థినిని
ఒక ప్రతిభా మూర్తిగా ఆవిష్కరింప చేయాలని ఆనాడే మన దేశం ఒక సు స్వర్ణ భారతం గా ఆవిస్కరింప బడగలదని తెలిపారు తద్వారా ఒక నవ శకo ఆవిష్కరిస్తుందని ఒక నవ యుగం ఆవిర్భవిస్తుందని తెలియ జేశారు మరియు అంజనీ కుమారి మరియు కరీ ముల్లా సంయుక్తంగా పై పాఠశాలలలో ఇప్పటి వరకు వారికి ఈ సంవత్సరం లో జరిగిన అన్ని పరీక్షలలో ఉత్తమ ప్రగతిని కనబరచి ప్రథమ ద్వితీయ తృతీయ స్థానములు పొందిన వారికి ప్రసంశా పత్రములను మరియు స్వెట్టర్స్ ను అందజేశారు స్టడీ మెటీరియల్స్ ముద్రణలో ఉన్నందున వారిని అతి త్వరలో అందజేయ గలమని తెలియజేశారు మరియు రానున్న పదవ తరగతి పరీక్షలలో ప్రథమ ద్వితీయ తృతీయ విజేతలుగా నిలిచిన విద్యార్థినులకు నగదు పారితోషికమును కూడా ఇవ్వగలమని తెలియజేశారు మరియు ఈ ప్రేరణా తరగతులలో పాల్గొన్న అనంత పురము మహాత్మా జ్యోతి బా పులే బాలికల గురుకుల విద్యాలయం ప్రిన్సిపల్ నారాయణ స్వామి విద్యార్థులు మంచి ఏకాగ్రతతో చదవాలని,మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని మంచి కళాశాలలో ప్రవేశార్హత ను పొంది మంచి ఉద్యోగాలలో చేరి గొప్ప భవిష్యత్తు కు ఈనాడే పునాది వేసుకోవాలని తెలియజేశారు మరియు ఈ ప్రేరణా తరగతులలో పాల్గొన్న మరో మోటి వేషనల్ స్పీకర్ తిరుపతి నుండి వచ్చిన సాప్ట్ వేర్ ఇంజినీర్ అనిల్ మాట్లాడుతూ ఏ మనిషి విజయానికైనా చక్కని ప్రణాళిక అవసరమని అట్టి గొప్ప ప్రణాళికలు రచించుకొని ప్రతి ఒక్కరు తమ జీవితాలలో వెలుగులు నింపుకోవాలని తెలియజేశారు.