Their government will protect communal harmony- Minister Anasuya (Sitakka)

భారత్ న్యూస్ హైదరాబాద్,

తమ ప్రభుత్వం మత సామరస్యాన్ని కాపాడుతుంది- మంత్రి అనసూయ (సీతక్క)

రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మత సామరస్యాన్ని కాపాడుతుందని మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. డా.బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయం క్రిష్టియన్ ఎంప్లాయిస్ అసోసియన్ ఆధ్వర్యంలో బుధవారం సచివాలయంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… లోక రక్షకుడైన ఏసుక్రిస్తు జన్మదినాన్ని క్రిస్మస్ పండుగను ప్రపంచవ్యాప్తంగా ఎంతో సంతోషంగా, ఆనందంగా జరుపుకునే పండుగని అన్నారు. విద్య వైద్యరంగాలలో కొనియాడదగిన సేవలను క్రైస్తవులు అందిస్తున్నారన్నారు. రాష్ట్రంలో క్రైస్తవులకు రక్షణ కల్పిస్తామని, ప్రజలందరూ, శాంతి, సోదరభావంతో మెలగాలని కోరారు.
ఈ సమావేశానికి ముఖ్య వక్తగా విచ్చేసిన ఎడ్వర్డ్ విలియమ్స్ క్రిస్ట్ మస్ కేక్ ను కట్ చేశారు. అనంతరం విలియమ్స్ మాట్లాడుతూ… పాపములను క్షమించడానికి ఏసు ఈ లోకంలో అవతరించాడని అన్నారు. దేవుని ప్రేమను ఎలా పొందాలి, పంచుకోవాలనే అంశాలపై తెలియజేశారు. క్రిస్మస్ పండగ విశిష్టతనూ వివరించారు. ఏసు ప్రభువు బోధించిన శాంతి సూత్రములను ప్రజలందరూ ఆచరించలని కోరారు.
ప్రోటోకాల్ డైరెక్టర్ అరవిందర్ సింగ్, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి విజయకుమార్ శుభాకాంక్షలు తెలియజేశారు. సెక్రటేరియట్ చర్చ్ క్వయర్, సభ్యులు, మ్యూజిక్ డైరెక్టర్ పిజెడి కుమార్ ఆధ్వర్యంలో క్రిస్మస్ పాటలు ఆలపించారు. సెక్రెటేరియట్ ఉద్యోగులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణ సెక్రటేరియట్ ఎంప్లాయిస్ అసోసియోషన్ వైస్ ప్రెసిడెంట్ చిట్టిబాబు అధ్యక్షత వహించగా, ప్రెసిడెంట్ లాల్ బహదూర్ శాస్త్రి వందన సమర్పణ చేశారు. అసోసియోషన్ సభ్యులు సువర్ణరాజు, శశిభూషన్, ప్రేమలీల, దేవరాజు, విక్రమ్, మనోరమ, స్వామినాథన్, వసంత్ విప్లవ్, జేకబ్ రాస్ తదితరులు పాల్గొన్నారు.