,మహిళా సాధికారిత ….ఈ పదం ఎప్పుడూ వింటూనే వుంటాం.

రవికుమార్.ఉదయ్ హైదరబాద్,,,మహిళా సాధికారిత ….ఈ పదం ఎప్పుడూ వింటూనే వుంటాం.న్యూస్ పేపర్ లో నో టెలివిజన్ చానల్స్ లో నో మీటింగ్ లలోనో..కాసింత చేయూత నిస్తే చాలు.తమ సత్తా ఏమిటో చూపిస్తారు మహిళలు.పెద్దగా చదువుకోక పోయినా..తమ ప్రతిభతో అన్నిరంగాలలో ముందుకు సాగుతారు.చిన్న మొత్తాల రుణం తీసుకొని గ్రూప్ లు గా ఏర్పడి కానీ.వ్యక్తిగత రుణాలు పొంది కానీ.చిన్న చిన్న వ్యాపారాలు పరిశ్రమలు.స్థాపించి .తమ కుటుంబాల ను పోషించు కోవడం తో పాటు సమాజ అభి వృద్ధి లో భాగస్వామ్యులు అవుతారు. ఇటీవల నాంపల్లి బజార్ ఘాట్ లోని గోకుల్ నగర్ లో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర మహిళా సాధికారత ను చాటిచెప్పింది.ప్రధానమంత్రి నరేంద్రమోడీ సత్సంకల్పంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఆహ్లాదకరమైన వాతావరణం లో చక్కగా జరిగింది.కేంద్ర ప్రభుత్వం మహిళలకు కేటాయించిన పథకాల పై అవగాహన కల్పించి.వారిని అభివృద్ధిలో భాగస్వాములను చేయడమే ఈ వికసిత్ భారత్ సంకల్పయాత్ర ముఖ్య ఉద్దేశం.బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్తాపూర్ సహకారం తో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు ప్రారంభించారు. స్వావలంబన పొందుతున్న మహిళల తో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల అమలు పట్ల మహిళలు చూపిస్తున్న ఆసక్తి పట్ల హర్షం వ్యక్తం చేశారు….ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు