Chintapalli Essay in Devarakonda Constituency should be removed from service.

భారత్ న్యూస్ హైదరాబాద్,

దేవరకొండ నియోజకవర్గం లోని చింతపల్లి ఎస్సైని సర్వీసు నుంచి రిమూవ్ చేయాలి.
తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ అజయ్ నాయక్ డిమాండ్.

పాలెం తండాకు చెందిన సూర్యా నాయక్ అనే వ్యక్తిని చింతపల్లి ఎస్సై సతీష్ రెడ్డి తీవ్రమైనటువంటి. వేధింపులు భౌతిక దాడి వల్లనే మరణించడం జరిగింది సూర్య నాయక్ మరణానికి సతీష్ రెడ్డి పై .307. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే సర్వీసు నుంచి రిమూవ్ చేయాలని డిమాండ్ చేశారు. అమాయకులైనటువంటి గిరిజనులను పోలీసుల వేధింపుల వల్లనే చనిపోవడం జరుగుతుంది చట్టపరంగా తప్పు చేస్తే కోర్టుకు హాజరు పరచాల్సినటువంటి అవసరం ఉంది కానీ చట్టాన్ని తన చేతిలో తీసుకొని భౌతిక దాడులు చేయడం వల్ల ఇటువంటి సంఘటనలు జరుగుతుంటాయి దీన్ని తెలంగాణ గిరిజన సమాఖ్య ఖండిస్తుంది వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని రమావత్ అంజయ్య నాయక్ డిమాండ్ చేశారు. ఈ మరణాన్ని రాజకీయ కోణంలో చూడకుండా పోలీసు అధికారులు భౌతిక దాడి వల్లనే సూర్య నాయక్ చనిపోవడం అనేది తన కుటుంబ సభ్యుల ఆరోపణ దీనిపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి లేనియెడల రాబోయేటువంటి రోజుల్లోతీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అంజయ్య నాయక్ పోలీస్ అధికారులను హెచ్చరించారు.
.. అభినందనలతో
రమావత్ అంజయ్య నాయక్ తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.