Everyone should follow the sayings of Jesus Christ that one should act with love towards one’s fellow man…walk in the right way.

భారత్ న్యూస్ హైదరాబాద్,


సాటి వారిపట్ల ప్రేమతో వ్యవహరించాలి…సన్మార్గంలో పయనించాలి అనే ఏసుక్రీస్తు సూక్తులను ప్రతి ఒక్కరు అనుసరించాల్సిన అవసరం ఉందని మాజీమంత్రి, సనత్ నగర్ శాసనసభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అన్నారు. క్రిస్మస్ సందర్బంగా సోమవారం సికింద్రాబాద్ లోని వెస్లీ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్ధనలలో ఆయన పాల్గొన్నారు. ప్రార్ధనల అనంతరం బిషప్ పద్మారావు MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఆశీర్వచనం చేశారు. చర్చి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు పుట్టిన రోజును గొప్ప వేడుకగా జరుపుకొనే పండుగ క్రిస్మస్ అని పేర్కొన్నారు. నెలరోజులపాటు ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటారని తెలిపారు. ఏసుక్రీస్తు 2 వేల సంవత్సరాల క్రితం జన్మించారని, నాటి నుండి నేటి వరకు క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటూ వస్తున్నారని తెలిపారు. క్రిస్మస్ ను పురస్కరించుకొని చర్చిలను ఎంతో సుందరంగా అలంకరించి ప్రత్యేక ప్రార్ధనలతో చర్చిలు ఎంతో సందడిగా మారాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో చర్చి పాధర్ లు జేమ్స్, చర్చి కమిటీ సభ్యులు చందన్, సుదీర్, దివాకర్, దేవ సహాయం, కమలాకర్, ఫ్రాన్సిస్, BRS పార్టీ నాయకులు ఆకుల హరికృష్ణ, అత్తిలి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మెథడిస్ట్ చర్చిలో…

సనత్ నగర్ లోని మెథడిస్ట్ చర్చిలో సోమవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో మాజీమంత్రి, MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించిన అనంతరం MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని చర్చి ఫాదర్ ఆశీర్వదించారు. అనంతరం కేక్ కట్ చేసి చర్చి పాదర్ లకు తినిపించారు. ఏసుక్రీస్తు పుట్టిన రోజును గొప్ప వేడుకగా జరుపుకునే పండుగ క్రిస్మస్ అని ఆయన అన్నారు. సన్మార్గంలో నడవాలి..తోటి వారి పట్ల ప్రేమాభిమానాలతో మేలగాలనే ఏసుక్రీస్తు సూక్తులను అనుసరణీయం అన్నారు. ఈ కార్యక్రమంలో చర్చి పాధర్ జేమ్స్, నతానియల్, దాస్, వసంత్, రాజ్ గోపాల్, BRS డివిజన్ అద్యక్షులు కొలను బాల్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ శేఖర్, మాజీ అద్యక్షులు ఖలీల్, నాయకులు జమీర్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.