సింగర్ మంగ్లీకి అడ్వకేట్ సుబ్బారావు సవాల్!

.భారత్ న్యూస్ హైదరాబాద్….సింగర్ మంగ్లీకి అడ్వకేట్ సుబ్బారావు సవాల్!

అడ్వకేట్ సుబ్బారావు సింగర్ మంగ్లీకి సవాల్ విసిరారు.

ట్రేడింగ్ వ్యాపారాల్లో పెట్టుబడుల పేరుతో 150 మంది నుంచి కోట్లు వసూలు చేసిన స్కామ్‎లో సింగర్ మంగ్లీ ప్రమేయం లేకపోతే గురువారం బషీర్‎బాగ్ ప్రెస్ క్లబ్‎కు రావాలన్నారు.

ఈ స్కామ్‎లో మంగ్లీ, ఆమె సోదరుడికి ప్రమేయం ఉన్న ఆధారాలు తాను బయటపెట్టానని, కావాలంటే మరోసారి చూపిస్తానని సుబ్బారావు తెలిపారు.

మంగ్లీ తనను 10 లక్షలు డిమాండ్ చేసిందని, తాను సైలెంట్ అయితే రూ.10 లక్షలు ఇస్తానని ఆఫర్ ఇచ్చిందని ఆయన ఆరోపించారు.