భారత్ న్యూస్ విజయవాడ…అమరావతిలో రూ.200 కోట్లతో ఆప్కాబ్ ఐకానిక్ భవనం

Ammiraju Udaya Shankar.sharma News Editor..అమరావతి :
ఏపీ రాజధాని అమరావతిలో రూ.200 కోట్ల వ్యయంతో ఆప్కాబ్(APCOB) ఐకానిక్ భవనం నిర్మాణం శరవేగంగా సాగుతోంది. లింగాయపాలెంలో 0.495 ఎకరాల్లో జీ+17 అంతస్తులతో, హెలిప్యాడ్తో సహా 2.09 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని నిర్మిస్తున్నారు. ఆప్కాబ్ అక్షరాలు ప్రతిబింబించేలా ఈ డిజైన్ను రూపొందించారు. భవన నిర్మాణ బాధ్యతలను ఏపీఐఐసీకి అప్పగించగా.. ఐఐటీ హైదరాబాద్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ సాంకేతిక సహకారాన్ని అందిస్తున్నాయి.
