భారత్ న్యూస్ రాజమండ్రి…అన్నా క్యాంటీన్‌ను సందర్శించిన ఏఎంసీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు
అవనిగడ్డ, జూన్ 8: అవనిగడ్డ లోని అన్నా క్యాంటీన్‌ను దివి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు సోమవారం సందర్శించారు. క్యాంటీన్‌లో పేదలకు అందిస్తున్న భోజన సదుపాయాలను, నాణ్యతా ప్రమాణాలను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా క్యాంటీన్‌లో భోజనం చేస్తున్న వివిధ వర్గాల ప్రజలు, కూలీలతో చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు నేరుగా మాట్లాడారు. క్యాంటీన్‌లో అందిస్తున్న ఆహార పదార్ధాల నాణ్యత, రుచి, మరియు అందుతున్న సేవలపై వారిని అడిగి తెలుసుకున్నారు.
కేవలం ఐదు రూపాయలకే ఎంతో రుచికరమైన, శుభ్రమైన భోజనాన్ని అందిస్తున్నారని, ఇక్కడి వసతుల పట్ల తామంతా పూర్తి సంతృప్తితో ఉన్నామని భోజనం చేస్తున్న వారు చైర్మన్‌కు వివరించారు. పేదల ఆకలి తీర్చడంలో అన్నా క్యాంటీన్లు ఎంతో దోహదపడుతున్నాయని వారు హర్షం వ్యక్తం చేశారు.

అనంతరం చైర్మన్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా పేద ప్రజలకు నాణ్యమైన, పౌష్టికాహారాన్ని అందించడమే లక్ష్యంగా అన్నా క్యాంటీన్లు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. క్యాంటీన్ నిర్వాహకులు నిరంతరం ఇదే నాణ్యతను, పరిశుభ్రతను పాటించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.