…భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్: నగరవాసులకు ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో ప్రయాణించేవారికి ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొండాపూర్‌కు వెళ్లే అత్యాధునిక మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ నిర్మాణం దాదాపు పూర్తయింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా జూన్ మొదటి వారంలో పైవంతెన ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది అందుబాటులోకి వస్తే గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గడంతో పాటు ప్రయాణ సమయం కూడా ఆదా కానుంది.
ఓఆర్‌ఆర్ నుంచి కొండాపూర్, హఫీజ్‌పేట్ మార్గాల్లో వెళ్లే వాహనాలకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు మెరుగైన కనెక్టివిటీ లభిస్తుంది. ప్రయాణ సమయం ఆదాతో పాటు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా వేగంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. కొండాపూర్ ప్రాంతం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్.. అక్కడి నుంచి కొండాపూర్ తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు గచ్చిబౌలి వద్ద ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుండా నేరుగా వెళ్లే వెసులుబాటు కలుగుతుంది…
