ఆర్‌ఎస్‌ఎస్‌ మాజీ కార్యకర్త క్యాన్సర్‌తో మృతి.. అంత్యక్రియలు నిర్వహించిన ముస్లిం మహిళ

భారత్ న్యూస్ నల్గొండ….ఆర్‌ఎస్‌ఎస్‌ మాజీ కార్యకర్త క్యాన్సర్‌తో మృతి.. అంత్యక్రియలు నిర్వహించిన ముస్లిం మహిళ

కేరళలో మత సామరస్యానికి ఒక ఉదాహరణగా ఈ సంఘటన నిలిచింది.

నారాయణన్‌ను చూసుకోలేమని అతడి సోదరి తెలిపింది. ఇంటికి తీసుకెళ్లడానికి అతడి భార్య, పిల్లలు కూడా ఇష్టపడలేదు. ఈ నేపథ్యంలో ఆయనకు వైద్య చికిత్స అందించేందుకు ఇర్ఫానా ముందుకు వచ్చారు. జిల్లా కలెక్టర్ సహాయంతో కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ జూన్‌ 26న ఆయన మరణించారు.

మరోవైపు నారాయణన్‌ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించే ఆర్థిక స్తోమత తమకు లేదని అతని కుటుంబ సభ్యులు, సోదరి ఇర్ఫానాకు తెలిపారు. దీంతో ఆమె స్పందించారు. ఆయన మృతదేహానికి స్వయంగా అంత్యక్రియలు నిర్వహించారు. ‘నా ప్రజా జీవితంలో నేను ఒక అసాధారణ పరిస్థితిని ఎదుర్కొన్నా. కానీ ఏమి చేయాలో నిర్ణయించుకోవడానికి నాకు ఏమాత్రం సమయం పట్టలేదు. హిందూ సంప్రదాయాల ప్రకారం ఆయన అంత్యక్రియలు జరుపాల్సి ఉన్నది. జూన్ 26 మధ్యాహ్నం చిగురుపడావు గ్రామంలోని శ్మశానవాటికలో నేను ఆ అంత్యక్రియలను నిర్వహించా’ అని తెలిపారు.