సైబర్ నేరస్థుడి వలలో పడి రూ.3.37 కోట్లు పోగొట్టుకున్న మాజీ ఐఏఎస్

భారత్ న్యూస్ హైదరాబాద్….సైబర్ నేరస్థుడి వలలో పడి రూ.3.37 కోట్లు పోగొట్టుకున్న మాజీ ఐఏఎస్

స్టాక్ మార్కెట్లో భారీ లాభాలంటూ ఆశ చూపి మోసం

ఉమ్మడి రాష్ట్రంలో ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో పనిచేసి హైదరాబాద్‌లోని సోమాజీగూడలో నివాసముంటున్న మాజీ ఐఏఎస్ (72)

కొన్ని నెలల క్రితం ఆయన సెల్‌ఫోన్‌కు ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ పేరిట లింక్ రావడంతో.. ట్రేడింగ్‌కు ఆసక్తి చూపించిన తానుకు కంపెనీ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్‌ను అంటూ పేరిట ఫోన్లో పరిచయం చేసుకున్న అర్జున్ మెహతా

తాము రూపొందించిన కృత్రిమమేధ ఆధారిత పరిజ్ఞానంతో మ్యూచువల్ ఫండ్స్, ఐపీవోల్లో పెట్టుబడులు పెడితే లిస్టింగ్ సమయం లోనే 120-160 శాతం వరకు లాభాలు పొందొచ్చని ఆశ చూపించిన సైబర్ నేరగాడు

దీంతో నమ్మిన మాజీ ఐఏఎస్ అధికారికి రోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో వాట్సప్ వీడియోకాల్ చేస్తూ షేర్ మార్కెట్ తీరుపై సలహాలు ఇస్తూ నమ్మకం కలిగించిన సైబర్ నేరస్థుడు

అనంతరం స్టాక్ మార్కెట్ పెట్టబడుల పేరిట తాను సూచించిన ఖాతాలకు పలుమార్లు మొత్తం రూ.3.37 కోట్లను తన ఖాతాలో వేయించుకున్న సైబర్ నేరస్థుడు

ఈ మొత్తం పెట్టుబడికి రూ.22.35 కోట్ల లాభమొచ్చిందని మాజీ ఐఏఎస్‌కు వర్చువల్ ఖాతాలో చూపించగా.. తీరా ఆ సొమ్మును విత్ డ్రా చేసుకునేందుకు మాజీ ఐఏఎస్ ప్రయత్నించగా సాధ్యం కాకపోవడంతో మోసపోయానని గ్రహించిన టీజీసీఎస్బీలో ఫిర్యాదు చేసిన మాజీ ఐఏఎస్