20-30 రోజులుగా సాగు చేసిన ధాన్యంతో కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్న రైతులు

..భారత్ న్యూస్ హైదరాబాద్….20-30 రోజులుగా సాగు చేసిన ధాన్యంతో కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్న రైతులు

దాదాపు 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నిలిచి ఉందని చెప్తున్న అధికారులు

కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, మహబూబాబాద్, నగర్ కర్నూలు, జనగామ, యాదాద్రి భువనగిరి, కొత్తగూడెం, భూపాలపల్లి జిల్లాల్లో అనేక రోజులుగా కొనుగోలు కేంద్రాల్లోనే దర్శనమిస్తున్న వడ్ల కుప్పలు

ఇప్పటివరకు కొన్న ధాన్యం కూడా లారీలు లేక కొనుగోలు కేంద్రాల వద్దనే నిలిచిపోయిందని వాపోతున్న రైతులు

సామాన్యంగా ధాన్యం కాంట వేసిన తరువాత మాకు సంబంధం ఉండదని, కానీ ఇప్పుడు ధాన్యం బస్తాలు మిల్లర్లు తీసుకెళ్ళేవరకు మాదే బాధ్యత అని అధికారులు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు

అకాల వర్షాలు కురుస్తున్నాయని, ధాన్యం అంతా నీటిపాలు అవుతుందని వెంటనే కొనుగోలు చేయాలని వేడుకుంటున్న రైతులు