…భారత్ న్యూస్ హైదరాబాద్….పాతబస్తీ అగ్నిప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
TG: హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన అగ్ని ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆయన ట్వీట్ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. మరోవైపు ఘటనా స్థలాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. ఆయన వెంట ఎంఐఎం ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీ కూడా ఉన్నారు.
