విజయనగరంలో ‘ఉగ్ర’ కలకలం!

భారత్ న్యూస్ విశాఖపట్నం..విజయనగరంలో ‘ఉగ్ర’ కలకలం!

AP: ఉగ్రవాదానికి ఆకర్షితులైన ఇద్దరు అనుమానితులను హైదరాబాద్ పోలీసులు విజయనగరంలో అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. టెర్రరిస్ట్ ఐడియాలజీతో గడుపుతున్న సిరాజ్ ఉర్ రెహ్మాన్ (29)పై కొన్ని రోజులుగా నిఘా పెట్టి అరెస్టు చేశారు. అతడిచ్చిన సమాచారంతో HYDకు చెందిన సయ్యద్ సమీర్ (28)ను అదుపులోకి తీసుకున్నారు. వీరిని కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలుస్తోంది. కాగా సిరాజ్ తండ్రి పోలీస్ శాఖలో పనిచేస్తున్నట్లు సమాచారం.