జూన్ 9 నుంచి ఆంధ్రా ప్రీమియర్ లీగ్ సీజన్ -5!

భారత్ న్యూస్ విశాఖపట్నం..జూన్ 9 నుంచి ఆంధ్రా ప్రీమియర్ లీగ్ సీజన్ -5!

ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (APL) ఐదో సీజన్ వచ్చే నెల 9న ప్రారంభం కానుంది. ఈసారి వైజాగ్, కడప, మంగళగిరి వేదికల్లో మొత్తం 32 మ్యాచులు జరగనున్నాయి. జూన్ 9-14 వరకు విశాఖలో, 17-21 వరకు కడపలో, 24-30 వరకు మంగళగిరిలో మ్యాచులు నిర్వహిస్తారు. 7 జట్లు తలపడే ఈ టోర్నీని జియో హాట్ స్టార్లో ప్రసారం చేయనున్నారు. గత సీజన్తో పోలిస్తే ఈసారి అదనంగా మరో రెండు వేదికలను చేర్చారు.