ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు కేంద్రం కొత్త రూల్స్.. పీఎన్జీ (PNG) వస్తే సిలిండర్ కట్!

భారత్ న్యూస్ హైదరాబాద్…ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు కేంద్రం కొత్త రూల్స్.. పీఎన్జీ (PNG) వస్తే సిలిండర్ కట్!

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ఇరాన్ హార్మూజ్ జలసంధి మూసివేత పరిణామాలతో ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతోంది.

దేశంలో ఇంధన ధరల పెరుగుదలతో పాటు, గృహ వినియోగదారుల ఎల్పీజీ (LPG) గ్యాస్ కనెక్షన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం పలు కఠిన నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది.

ముఖ్యంగా పైప్‌లైన్ గ్యాస్ (PNG) కనెక్షన్ల వినియోగంపై కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.

కొత్త నిబంధనల్లోని ముఖ్యాంశాలు:

ఒకే అడ్రస్‌పై రెండు కనెక్షన్లు నిషిద్ధం: ఒకే ఇంట్లో ఎల్పీజీ సిలిండర్ మరియు పీఎన్జీ (పైప్‌లైన్ గ్యాస్) కనెక్షన్ రెండూ ఉండటాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది.

పీఎన్జీ వాడుతున్న ఇళ్లకు కొత్త ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వడం లేదా సిలిండర్ రీఫిల్ చేయడాన్ని కంపెనీలు నిలిపివేయనున్నాయి.

30 రోజుల్లో క్యాన్సిలేషన్ లేదా వోచర్: పీఎన్జీ కనెక్షన్ తీసుకున్న 30 రోజుల్లోగా వినియోగదారులు తమ ఎల్పీజీ కనెక్షన్‌ను రద్దు చేసుకోవాలి. లేదా బదిలీ అయ్యే ఉద్యోగులు, విద్యార్థులు, వలస కుటుంబాల సౌలభ్యం కోసం భవిష్యత్తు అవసరాల నిమిత్తం ‘ట్రాన్స్‌ఫర్ వోచర్’ పొందే వెసులుబాటు కల్పించారు.

3 నెలల డెడ్ లైన్: మీ ప్రాంతంలో పీఎన్జీ పైప్‌లైన్ నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చి, కంపెనీల నుంచి మీకు నోటీసు వచ్చిన 3 నెలల లోపు కచ్చితంగా పీఎన్జీకి మారాలి. నిర్ణీత గడువులోగా మారకపోతే, ఆ ఇంటికి సరఫరా అవుతున్న ఎల్పీజీ సిలిండర్ కనెక్షన్ ఆటోమేటిక్‌గా రద్దవుతుంది.

అద్దెదారులకూ (Tenants) తప్పనిసరి: ఈ నిబంధనలు కేవలం సొంత ఇల్లు ఉన్న యజమానులకే కాకుండా, అద్దె ఇళ్లలో ఉండే వారికి కూడా వర్తిస్తాయి. వారు కూడా ఎల్పీజీ సిలిండర్లను సరెండర్ చేసి తమ పరిధిలోని పీఎన్జీ కనెక్షన్‌ను వాడుకోవాల్సి ఉంటుంది.

డిస్ట్రిబ్యూటర్లు, చమురు సంస్థలకు కేంద్రం నుంచి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కొత్త నిబంధనలను గమనించి, తదనుగుణంగా మార్పులు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.®✓