అమర్నాథ్ యాత్ర భద్రతకు 42 వేల మంది సాయుధ బలగాలు

భారత్ న్యూస్ ఢిల్లీ…..అమర్నాథ్ యాత్ర భద్రతకు 42 వేల మంది సాయుధ బలగాలు

ప్రతిష్ఠాత్మకమైన అమర్ నాథ్ యాత్ర భద్రత కోసం 581 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో CRPF, CISF, BSF, ITBP, ఎస్ఎస్ఓలకు చెందిన 42,000 మంది జవాన్లు యాత్రా మార్గంలో భద్రతను పర్యవేక్షిస్తారు. అమర్నాథ్ యాత్ర జులై 3న మొదలై ఆగస్టు 9న ముగుస్తుంది. మొత్తం 38 రోజుల పాటు యాత్ర కొనసాగనుంది.