ప్రాణాల మీదకొచ్చిన పులితో సెల్ఫీ..◆భారత పర్యాటకుడిపై దాడి చేసిన పులి..

భారత్ న్యూస్ ఢిల్లీ…..ప్రాణాల మీదకొచ్చిన పులితో సెల్ఫీ..◆భారత పర్యాటకుడిపై దాడి చేసిన పులి..

●థాయ్ లాండ్ లో ఘటన…
◆పుకెట్ టైగర్ పార్కులో భయానక సంఘటన..

■◆థాయ్‌లాండ్‌లోని ప్రఖ్యాత టైగర్ కింగ్‌డమ్‌ను సందర్శించిన భారతీయ పర్యాటకుడికి భయంకరమైన అనుభవం ఎదురైంది. పులితో సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో ఉండగా అది ఒక్కసారిగా దాడి చేసింది. భారతీయ పర్యాటకుడు పుకెట్ లోని టైగర్ కింగ్‌డమ్‌లో ఒక పులి పక్కన నడుస్తూ, ఫోటో కోసం కింద కూర్చున్నాడు. ఆ సమయంలో ట్రైనర్ ఒకరు కర్ర సాయంతో పులిని కూర్చోబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయితే, అనూహ్యంగా ఆ పులి పర్యాటకుడిపైకి లంఘించింది.

“థాయ్‌లాండ్‌లో ఒక భారతీయ పర్యాటకుడిపై పులి దాడి చేసినట్లు తెలుస్తోంది. టైగర్ కింగ్‌డమ్‌లో పులులకు తగిన శిక్షణ ఇస్తారు. తగిన రుసుము వసూలు చేసి పులితో సెల్ఫీలు, వీడియోలు తీసుకునేందుకు పర్యాటకులకు అవకాశం కల్పిస్తారు. ఇలా శిక్షణ ఇచ్చిన పులితో సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలోనే ఈ దాడి జరిగింది” పులి దాడి నుంచి సదరు పర్యాటకుడు స్వల్ప గాయాలతో బయట పడినట్లు తెలుస్తోంది…