9న దేశవ్యాప్త సమ్మె

భారత్ న్యూస్ ఢిల్లీ…..9న దేశవ్యాప్త సమ్మె

ఈనెల 9న దేశంలో 2 రకాల సమ్మెలకు కార్మికులు సిద్ధమవుతున్నారు.

యూపీలో విద్యుత్ డిస్కంలను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ 27 లక్షల మంది నిరసనలో పాల్గొననున్నారు.

మరోవైపు అదేరోజు తాము కూడా సమ్మె చేస్తామని వ్యవసాయ కార్మిక సంఘం ప్రకటించింది.

4 లేబర్ కోడ్ల రద్దు, ఉపాధి హామీకి రూ.రెండున్నర లక్షల కోట్ల నిధుల కేటాయింపు, పట్టణాల్లోనూ ఉపాధిహామీ పథకం అమలు చేయాలనే డిమాండ్లతో దీన్ని చేపట్టనున్నట్లు తెలిపింది.