భారత్ న్యూస్ ఢిల్లీ…..నిర్లక్ష్యంగా వాహనం నడిపి మరణిస్తే ఇన్సూరెన్స్ కంపెనీ బీమా చెల్లించాల్సిన అవసరం లేదు
ఆక్సిడెంట్‌లో మరణించిన వ్యక్తికి రూ.80 లక్షలు చెల్లించాలంటూ ఇన్సూరెన్స్ కంపెనీ పట్ల దాఖలైన పిటిషన్ విచారణలో సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు
2014వ సంవత్సరం కర్ణాటక రాష్ట్రంలో రవిషా అనే వ్యక్తి, అతి వేగంగా, నిర్లక్ష్యంతో కారు నడిపి మరణించగా, ఇన్సూరెన్స్ కంపెనీ రూ.80 లక్షలు చెల్లించాలంటూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన బాధితుడి కుటుంబ సభ్యులు
ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా, నిర్లక్ష్యంగా వాహనం నడిపి మరణిస్తే, వారి కుటుంబ సభ్యులు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోలేరంటూ తీర్పు ఇచ్చిన కర్ణాటక హైకోర్టు
ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన బాధితుడి కుటుంబ సభ్యులు
కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ, నిర్లక్ష్యంగా వాహనం నడిపితే దానికి ఇన్సూరెన్స్ కంపెనీ బాధ్యత వహించాల్సిన అవసరం లేదని తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు
