భారత్ న్యూస్ ఢిల్లీ…మరికాసేపట్లో కేంద్ర కేబినెట్ అత్యవసర భేటీ..
పార్లమెంట్లో కేంద్రం ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన సంగతి తెలిసిందే.
దీంతో డీలిమిటేషన్, కేంద్ర పాలిత ప్రాంతాల సవరణ చట్టం బిల్లులకు కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.
ఈ నేపథ్యంలోనే కేంద్ర కేబినెట్ శనివారం అత్యవసర మీటింగ్ నిర్వహించనుంది.
ప్రధాని మోదీ నేతృత్వంలో ఉదయం 11.30 గంటలకు ఈ సమావేశం జరగనుంది.
ఈ మీటింగ్లో తాజా రాజకీయ పరిస్థితులను సమీక్షించడం, పలు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణలపై చర్చించే అవకాశం కూడా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.
ఆర్టికల్ 370 లాంటి పలు కీలక నిర్ణయాలను ఎన్డీయే ప్రభుత్వం ఇలాంటి అత్యవసర కేబినెట్ సమావేశాల్లోనే తీసుకుంది.
ఈ క్రమంలోనే శనివారం నిర్వహించబోయే ఈ సమావేశంపై ఆసక్తి నెలకొంది.
మరోవైపు పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్కు సంబంధించిన బిల్లు వీగిపోవడంతో దీనికి గల కారణాలపై ఎన్డీయే కూటమి ఇప్పటికే సమీక్ష నిర్వహించింది.
శుక్రవారం రాత్రి లోక్సభలో ఓటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత NDA కూటమి నేతలు సమావేశమయ్యారు.

బీజేపీ తరఫున కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అర్జున్ రాం, మేఘ్వాల్, ధర్మేంద్ర ప్రధాన్తో