మహిళా సాధికారత దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం జిల్లా గాజువాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగే సెమినార్ లో మహిళలు వారి హక్కులు సమాజము

భారత్ న్యూస్ విశాఖపట్నం..మహిళా సాధికారత దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం జిల్లా గాజువాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగే సెమినార్ లో మహిళలు వారి హక్కులు సమాజము – కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత 50 మంది మహిళా ఉపాధ్యాయునిలు మరియు పాఠశాల ఎస్ఎంసి మహిళ ప్రతినిధులు పాల్గొన్న కార్యక్రమంలో పాఠశాల హెడ్మాస్టర్ అధ్యక్షతన జరిగిన సెమినార్లో ముఖ్య వక్తలుగా 1) గాజువాక పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ పార్థసారధి గారు 2) జీవీఎంసీ 67వ వార్డు కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు గారు మరియు 3) జన విజ్ఞాన వేదిక విశాఖపట్నం జిల్లా ఉపాధ్యక్షులు మరియు గాజువాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యా కమిటీ ప్రతినిధి డాక్టర్ లక్ష్మణ స్వామి పాలూరు తదితరులు మాట్లాడడం జరిగింది ఈ సెమినార్ లో వివిధ అంశాలపై చర్చ మరియు మహిళల యొక్క వాస్తవిక భావనలు తో పాటు వారి వారి కుటుంబ సభ్యులు మరియు ప్రభుత్వాలు నుండి మహిళలు ఆశిస్తున్నా అంశాలు కూడా చర్చికి రావడం జరిగింది. ఈ కార్యక్రమం శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు సాగింది పాఠశాల విద్యా కమిటీ ప్రతినిధి డాక్టర్ లక్ష్మణ స్వామి కోఆర్డినేట్ చేయడం జరిగింది. 🌹🌷💐🪴