నా పేరుతో పద్మశ్రీ వచ్చినా.. ఇది ఉద్యమకారులందరికీ దక్కిన గౌరవం!

భారత్ న్యూస్ ఢిల్లీ…Manda Krishna Madiga: నా పేరుతో పద్మశ్రీ వచ్చినా.. ఇది ఉద్యమకారులందరికీ దక్కిన గౌరవం!

వ్యక్తిగతంగా నా పేరుతో పద్మశ్రీ వచ్చినా.. ఇది ఉద్యమకారులందరికీ దక్కిన గౌరవం అని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు.

పద్మశ్రీ పురస్కారం ఉద్యమానికి దక్కిన అభినందనలు అని తెలిపారు. 1994లో ఉద్యమం మొదలైందని, ఎమ్మార్పీఎస్‌ది ముప్పై ఏళ్ల పోరాటమన్నారు. సమాజంలో అన్ని వర్గాల అండదండలతోనే ఉద్యమం సాధ్యమయిందన్నారు. సుప్రీంకోర్టు సైతం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని మందకృష్ణ మాదిగ అన్నారు. మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన పద్మ పురస్కారాల రెండో విడత ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా మందకృష్ణ పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.

‘పద్మశ్రీ పురస్కారం ఉద్యమానికి దక్కిన అభినందనలు. వ్యక్తిగతంగా నా పేరుతో పద్మశ్రీ వచ్చినా.. ఇది ఉద్యమకారులందరికి దక్కిన గౌరవం. సమాజంలో అన్ని వర్గాల అండదండలతోనే ఉద్యమం సాధ్యమయింది. 1994లో ఉద్యమం మొదలైంది, ఎమ్మార్పీఎస్‌ది ముప్పై ఏళ్ల పోరాటం. సుప్రీంకోర్టు సైతం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఉద్యమ లక్ష్యం నెరవేరింది, కేంద్రం గుర్తింపు కూడా ఇచ్చింది. పద్మశ్రీ అవార్డును గౌరవంగానే కాదు బాధ్యతగా ఫీల్ అవుతున్నాం. ఇంకా పరిష్కారం కాని సమస్యల కోసం భవిష్యత్ ప్రయాణం ఉంటుంది. చట్టసభల్లో పరిష్కారం కావాల్సిన సమస్యలు ఉన్నాయి. రాజకీయాల్లోకి వచ్చినా కండువా మారదు. రాజకీయ చైతన్యం కోసం కూడా సిద్ధం అవుతాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతోనే మాదిగలకు అన్యాయం జరిగింది. ఏపీలో చంద్రబాబు నాయుడు మాదిగలకు ప్రాతినిధ్యం పెంచారు’ అని మందకృష్ణ మాదిగ అన్నారు.