Prabhas after returning from the tour he joined three films

ప్రభాస్‌. టూర్ నుంచి తిరిగి రాగానే మూడు సినిమాలకు కలిపి అతిపెద్ద ప్లాన్ వేసిన ప్రభాస్ నెల రోజుల్లోనే మూడు సినిమాలకు సంబంధించిన కార్యక్రమాలకు మరియు షూటింగ్స్ కు హాజరు అయ్యే విధంగా ప్రభాస్ ప్లాన్ చేసుకున్నట్లుగా సమాచారం అందుతోంది.
ఆదిపురుష్ సినిమా విడుదల అయిన వెంటనే ప్రభాస్‌ మోకాలికి సంబంధించిన చిన్న శస్త్ర చికిత్స నిమితం యూరప్ వెళ్లాడు. అక్కడే రెండు నెలల నుంచి ఉంటున్నాడు. మధ్యలో ఒకటి రెండు సార్లు వచ్చాడు అనే ప్రచారం జరిగింది. అది ఎంత వరకు నిజం అనేది మాత్రం క్లారిటీ లేదు. ఎట్టకేలకు ప్రభాస్ రెండు నెలల తర్వాత ఇండియా కు రాబోతున్నాడు అంటూ. ఫిలింనగర్ సమాచారం మరోసారి వార్తలు వస్తున్నాయి. నవంబర్‌ 6వ తేదీన ప్రభాస్ హైదరాబాద్‌ కి వస్తాడు. వచ్చిన రెండు రోజుల్లోనే సలార్‌ సినిమా ప్రమోషన్ కి సంబంధించి దర్శకుడు ప్రశాంత్ నీల్ మరియు నిర్మాణ సంస్థ ప్రతినిధులతో భేటీ అవ్వబోతున్నాడు. సలార్‌ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు సంబంధించి చర్చలు జరిపిన తర్వాత మారుతి దర్శకత్వంలో సినిమా కోసం డేట్లు ఇవ్వబోతున్నాడు.