Shruti Haasan commented that what is wrong with taking drugs

భారత్ న్యూస్ సినిమా,,సెలబ్రిటీలకు పబ్ కల్చర్ అనేది కామన్. అందులోనూ సినిమా స్టార్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటీ, నటులకు డ్రగ్స్ అలవాటు ఉందనే విషయం పలుమార్లు రుజువైంది. దీనిపై మొదటిసారి నోరు విప్పారు స్టార్ హీరోయిన్ శృతి హాసన్. తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న శృతి హాసన్‌కు డ్రింకింగ్, డ్రగ్స్ గురించి ప్రశ్నలు ఎదురైయ్యాయి.ఊహించని ప్రశ్నలకు సూటీగానే డ్రింకింగ్ అలవాటు ఉందంటూ సమాధానం ఇచ్చింది ఈ బ్యూటీ. అయితే ఒకప్పుడు డ్రింక్ చేసేదాన్ని అని..ఇప్పుడు మానేశానని చెప్పుకొచ్చింది. తాను ఎనిమిదేళ్ల క్రితమే డ్రింక్ చేయడం మానేశానని..తరచూ పార్టీలకు వెళ్లడం వల్ల మద్యపానం అలవాటు అయిందని..ఇది తీవ్రతరం అవుతుందని గ్రహించి డ్రింకింగ్‌కు దూరంగా ఉన్నానని తెలిపింది.