గుంటూరు కారం సినిమా నిర్మాత. ఆ సినిమా గురించి అప్డేట్ ఇచ్చారు

భారత్ న్యూస్ సినిమా,,,,,హారిక, హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం గుంటూరు కారం. సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దీన్ని తీర్చిదిద్దారు. అతడు, ఖలేజా తర్వాత 13 సంవత్సరాల సుదీర్ఘ విరామం అనంతరం వీరిద్దరి దర్శకత్వంలో రాబోతున్న సినిమా కావడంతో అంచనాలు విపరీతంగా ఉన్నాయి. తమన్ స్వరాలందించారు.గుంటూరు కారం సినిమాకు సంబంధించి నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు పొందారు. సంక్రాంతికి గుంటూరు కారంతోపాటు హనుమాన్, సైంధవ్, ఈగల్, నా సామిరంగ చిత్రాలు కూడా విడుదల కానున్నాయి. దీంతో థియేటర్ల కోసం పోటీ ఏర్పడింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని దిల్ రాజు ఒక వ్యూహాన్ని రూపొందించారు. భారీ ప్లానింగ్ తో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటున్నారు.తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని సింగిల్ స్క్రీన్లు ఉంటాయో వాటిల్లో 95 శాతం విడుదలైన మొదటిరోజే గుంటూరు కారం ప్రదర్శించే ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ సిటీ మొత్తం మీద సింగిల్ స్క్రీన్లు 96 ఉండగా, అందులో 90 స్క్రీన్లలో గుంటూరు కారం వేస్తున్నారు. అదేరోజు విడుదలవుతున్న హనుమాన్ చిత్రం మాత్రం కేవలం నాలుగైదు థియేటర్లతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది.