Why Ram Charan Jr.NTR’s,,rrr,, could not beat Baahubali

భారత్ న్యూస్ సినిమా,,,,,తెలుగు సినిమాను జాతీయ స్థాయికి, ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన రాజమౌళి తన తర్వాత సినిమాతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాలనే పట్టుదలతో ఉన్నారు. మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం దాదాపు రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాలు షూటింగ్ జరుపుకునే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు.బాహుబలి రెండు భాగాలతో ఈ దర్శక ధీరుడు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. దీని తర్వాత జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తో ఆర్ఆర్ఆర్ సినిమా తీశారు. అధికారికంగా ఆస్కార్ నామినేషన్లకు వెళ్లకపోయినా తన ప్రయత్నం తాను చేసి ప్రయివేటు నామినేషన్లద్వారా ఆస్కార్ కు వెళ్లేటట్లు రాజమౌళి చేశారు. కీరవాణికి ఉత్తమ సంగీత దర్శకుడిగా ఆస్కార్ అవార్డు వచ్చింది.ఈ సినిమా కేవలం రూ.1200 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. అన్ని రికార్డులను బద్దలు కొట్టి కనీసం రూ.2వేల కోట్లైనా వసూలు చేస్తుందని అందరూ భావించారు. అయితే ఈ సినిమాలో చిన్న చిన్న తప్పులుండటంవల్ల సాధ్యం కాలేదంటున్నారు. ఇండియాలో రూ.2వేల కోట్లు వసూలు చేసిన మొదటి సినిమాగా బాహుబలి2 రికార్డు సృష్టించింది. దాన్ని ఇంతవరకు ఎవరూ అధిగమించేకపోయారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసినా ప్రభాస్ రికార్డులను ఎందుకు బద్దలు కొట్టలేకపోయారు? అనే ప్రశ్న తరుచుగా సినీ అభిమానుల్లో ఉత్పన్నమవుతుంటుంది. ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసినా తమ డార్లింగ్ రికార్డును బద్దలు కొట్టలేకపోయారంటూ కామెంట్లు పెడుతుంటారు. సలార్ తో కొత్త రికార్డులు సృష్టిస్తున్న ప్రభాస్ తన రికార్డును తానే బద్దలు కొడతాడేమో చూడాలి మరి.