శ్రీకాకుళంలో అరుదైన ఆపరేషన్

భారత్ న్యూస్ శ్రీకాకుళం…..Ammiraju Udaya Shankar.sharma News Editor…శ్రీకాకుళంలో అరుదైన ఆపరేషన్

మీనాక్షి ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స విజయవంతం

శ్రీకాకుళం నగరంలోని మీనాక్షి ఆసుపత్రిలో అరుదైన మరియు అత్యంత క్లిష్టమైన శస్త్ర చికిత్సను సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ గొండు గంగాధర్ రావు విజయవంతంగా నిర్వహించారు.36 ఏళ్ల యువకుడు చాలాకాలంగా ITP- immune thrombocytopenic purpura (చాలా తక్కువ ప్లేట్లెట్ కౌంట్‌తో కూడిన రుగ్మత)తో ఆయన బాధపడుతున్నాడు.

దీని కారణంగా అతనికి ప్లేహం (బల్ల) పెరిగి (సుమారు 50 సెం.మీ.) ఉదర భాగం మొత్తం వ్యాపించడంతో, అతనికి ప్లేట్లెట్ కౌంట్ ఇంకా తగ్గడం, రక్తం గడ్డకట్టే శక్తి నశించడం, రక్తహీనత, తెల్ల రక్తకణాలు తగ్గడం (వ్యాధినిరోధక శక్తి నశించడం), ఆహారం తీసుకోలేకపోవడం, ఎటువంటి తేలికపాటి పని కూడా చేసుకోలేకపోవడంతో ఆరోగ్యం బాగా క్షీణించి,మీనాక్షి ఆసుపత్రిని సంప్రదించాడు.

అతడి పరీక్షలు నిర్వహించి, శస్త్ర చికిత్స అవసరం అని గుర్తించారు. శస్త్ర చికిత్స చేసే సమయంలో అతడికి కేవలం 7 గ్రాముల హిమోగ్లోబిన్ మరియు 16,000 ప్లేట్లెట్ కౌంట్ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో రక్తం గడ్డకట్టే సామర్థ్యం చాలా తక్కువగా ఉండి, శస్త్ర చికిత్స సమయంలో ప్రాణాంతకమైన రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుంది.

శస్త్ర చికిత్సను అత్యంత నైపుణ్యంతో, ఎటువంటి రక్తస్రావం జరగకుండా, ప్లేహాన్ని విజయవంతంగా తొలగించడం జరిగింది. తొలగించిన ప్లేహం సుమారు 40 సెం.మీ. (కుచించిన తర్వాత), నాలుగు కిలోగ్రాములు ఉన్నట్లు గుర్తించారు.

శస్త్ర చికిత్స అనంతరం పేషెంట్ చక్కగా కోలుకొని, 3.5 లక్షల ప్లేట్లెట్ కౌంట్‌తో ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యాడని తెలిపారు.