భారత్ న్యూస్ శ్రీకాకుళం…
దక్షిణ కాశ్మీర్ హిమాలయాల్లో సుమారు 3.880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ యాత్ర శుక్రవారం తెల్లవారుజామున మొదలైంది, బల్తాల్, నున్వాన్, రెండు బేస్ క్యాంపుల నుండి భక్తుల ఈ యాత్ర ప్రయాణం కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
ఈ ఏడాది అమర్ నాథ్ యాత్ర మొత్తం 57 రోజుల పాటు సాగనుంది. జూలై 3న ప్రారంభమైన ఈ యాత్ర ఆగస్టు 28న ముగియనుంది. యాత్ర సాఫీగా సాగేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాయి. భక్తులు రెండు మార్గాల ద్వారా అమర్నాథ్ గుహకు చేరుకుంటా రు. అందులో ఒకటి 48 కిలోమీటర్ల నున్వాన్ – పహల్గా మ్ మార్గం, మరొక టి 14 కిలోమీటర్ల బాల్తాల్ మార్గం ద్వారా యాత్ర కొనసాగుతోంది.
అనంత్‌నాగ్ జిల్లాలోని నున్వాన్ బేస్ క్యాంప్, గందర్ బల్ జిల్లాలోని సోన మార్గ్ సమీపంలోని బాల్తాల్ బేస్ క్యాంప్ నుంచి పెద్ద సంఖ్యలో యాత్రను ప్రారంభించారు. ఆయా జిల్లాల డిప్యూటీ కమిష నర్లు, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌లు తొలి బృందాలకు జెండా ఊపి యాత్రను ప్రారంభించారు.
జమ్మూలోని భగ వతి నగర్ యాత్ర బేస్ క్యాంప్ నుంచి గురువారం 4809 మంది భక్తులతో కూడిన తొలి బృం దాన్ని జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి భక్తులను పంపించారు. ఈ బృందం మధ్యాహ్నా నికి కశ్మీర్ లోయకు చేరుకోగా.. స్థానిక ప్రజలు, అధికారులు స్వాగతం పలికారు.
అమర్నాథ్ యాత్రను దృష్టిలో ఉంచుకుని వేలాది మంది జమ్మూకశ్మీర్ పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ఇతర పారామిలటరీ బలగాలను కూడా భారత ప్రభుత్వం మోహరించింది. యాత్ర మార్గాలపై డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా నిఘా కూడా ఉండనుంది. భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ.. అన్ని మార్గాల్లోనూ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు అధి కారులు తెలిపారు.
