భారత్ న్యూస్ హైదరాబాద్ …ట్రాఫిక్ అమలులో ఒకే న్యాయం అందరికీ వర్తిస్తుందా?…..
హైదరాబాద్లో ట్రాఫిక్ నిబంధుల అమలుపై కొంతమంది ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, కొన్ని ప్రాంతాల్లో ద్విచక్ర వాహనదారులను తరచుగా ఆపి తనిఖీలు, చలాన్లు విధిస్తున్నారని, అదే సమయంలో ఇతర ప్రాంతాల్లో నిబంధుల ఉల్లంఘనలు జరుగుతున్నా చర్యలు కనిపించడం లేదని ప్రశ్నిస్తున్నారు.
ప్రజల ప్రధాన డిమాండ్ ఏమిటంటే—చట్టం అందరికీ సమానంగా అమలుకావాలి. ప్రాంతం, మతం లేదా వర్గం అనే తేడా లేకుండా ట్రాఫిక్ నిబంధులను ఉల్లంఘించిన వారిపై ఒకే విధమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
అలాగే, వాహనాలను ఆకస్మికంగా ఆపే సమయంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రమాదాలకు దారితీయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

“చట్టం ముందు అందరూ సమానమే” అనే సూత్రాన్ని ప్రతి సందర్భంలో అమలు చేయడమే ప్రజల ఆకాంక్ష”….