భారత్ న్యూస్ విజయవాడ…కృష్ణా జిల్లా పోలీస్
మొహరంను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి-జిల్లా ఎస్పీ శ్రీ ఆర్.గంగాధరరావు, ఐపిఎస్.,
మొహరం దుఃఖ దినాలకు సంబంధించి జరిగే కార్యక్రమాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా జరిగేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఈరోజు జిల్లా ఎస్పీ శ్రీ ఆర్.గంగాధరరావు, ఐపీఎస్., గారు అన్నారు.
▪️మొహరానికి సంబంధించి ఎస్పీ గారు జరీపంజ, బారాయిమామ్ పంజాలను స్వయంగా సందర్శించి అక్కడి మత పెద్దలతో మొహరం ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు.
▪️శాంతి భద్రతలకు ఆటంకం కలిగించే చర్యలు వేటికి అవకాశం లేకుండా చూడాలని, మతసామరస్యానికి విఘాతం కలగకుండా ప్రశాంత వాతావరణంలో మొహరాన్ని జరుపుకోవాలని తెలిపారు.
▪️అందరూ సోదర భావంతో ఈ పండుగను నిర్వహించుకోవాలని ఎవరైనా గొడవలకు దిగితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.
▪️మొహరం దుఃఖ దినాలను పురస్కరించుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని, కోనేరు సెంటర్ వద్ద నిర్వహించే చెస్ట్ బీటింగ్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలతకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
▪️ఈ కార్యక్రమంలో ఎస్పీ గారి వెంట బందర్ డిఎస్పి సిహెచ్ రాజా గారు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు గారు, పట్టణ ఇన్స్పెక్టర్లు అబ్దుల్ నబీ గారు, పరమేశ్వర్ గారు, ఏసుబాబు గారు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
