భారత్ న్యూస్ గుంటూరు…కృష్ణాజిల్లా SP విద్యాసాగర్ నాయుడు గారి ఆదేశాల ప్రకారం, అవనిగడ్డ DSP అభిషేక్ గారి పర్యవేక్షణలో, అవనిగడ్డ CI యువ కుమార్ గారి అధ్వర్యంలో, కోడూరు ఎస్ఐ గారు వారి సిబ్బందితో ది.17. 04.2026 వ తేదీన తెల్లవారుజామున సుమారు 4.00 గంటలకు ఎస్ఐ గారికి రాబడిన సమాచారం ప్రకారం అవనిగడ్డ మండలం, వేకనూరు గ్రామానికి చెందిన భోగాధి కరుణకుమార్ అను అతను తనకు చెందిన అశోక్ లేలాండ్ బడా దోస్తు వాహనంలో సుమారు 2000 కేజీల PDS రైస్ అక్రమంగా తరలిస్తున్నడు అని , ఎస్ఐ గారు, మరియు సిబ్బంది, మధ్యవర్తుల సమక్షంలో అతనిని వీ కొత్తపాలెం లోని ఆంజనేయస్వామి గుడి వద్ద అరెస్ట్ చేసి, 45 తెల్లని గోను సంచులలో, ఒక్కో సంచిలో సుమారు 45 కేజీల బియ్యం కలిగి ఉన్న సుమారు 2000 కేజీల రేషన్ బియ్యంను స్వాధీనం చేసుకుని సదరు భోగాధి కరుణ కుమార్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగినది.

ఈ సందర్భంగా కోడూరు SI K. CHANAKYA గారు మాట్లాడుతూ కోడూరు మండల పరిధిలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగిన చట్టపరమైన కఠినచర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలుపడమైనది.