.భారత్ న్యూస్ హైదరాబాద్….గద్దరన్నకు ఇది శాశ్వత గుర్తింపు: బాలయ్య
గద్దరన్న పేరుతో సినీ ప్రముఖులకు అవార్డులు అందజేయడం ద్వారా ఆయనకు శాశ్వత గుర్తింపు లభించిందని హీరో బాలకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ‘కళలకు మరణం లేదు. తెలంగాణ ముద్దుబిడ్డ గద్దరన్న పేరుతో అవార్డు అందుకోవడం నా భాగ్యంగా భావిస్తున్నాను. దళిత కుటుంబంలో జన్మించి తన ప్రతిభతో చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన గద్దర్ నిజమైన ప్రజాకవి’ అంటూ పేర్కొన్నారు…
