దళితులకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను ప్రశ్నించే గళాలను నొక్కటానికి మచిలీపట్నం,,,

భారత్ న్యూస్ విజయవాడ. ఆకుల సతీష్,,

బందరులో దళిత నేతలు నిర్బంధం

దళితులకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను ప్రశ్నించే గళాలను నొక్కటానికి మచిలీపట్నం పోలీసులు ముందడుగు వేశారు. ఇద్దరు దళిత నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కృష్ణాజిల్లా దళిత జేఏసీ నేత, సీనీయర్ జర్నలిస్ట్, ఐజేయూ నాయకుడు వైఎస్ రాజేశ్వరరావును, ఎంఆర్పీఎస్ నేత బసవను చిలకలపూడి పోలీసు స్టేషన్లో నిర్భంధించారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో దళితుల భూముల్ని కైవశం చేసుకునే అవకాశం ఉందని, అదే విధంగా మచిలీపట్నం అంబేద్కర్ భవన్ ను శిథిల పరిచారని, దళితుల హక్కులను కాలరాస్తున్నారని, దళితులపై దాడులు పెరిగాయని .. దళిత జేఏసీ ఇటీవల తమ గళాన్ని విప్పింది. ఎన్నికల ప్రచారం నిమిత్తం సీఎం జగన్ మచిలీపట్నం వస్తున్న నేపథ్యంలో..దళితులకు ఆయన ఇచ్చిన హామీలు, హక్కులపై దాడులు తదితర అంశాలపై ప్రశ్నించే అవకాశం ఉందనే సమాచారంతో ఈ ఇద్దరు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. దళితుల గొంతును నొక్కేందుకు పోలీసులు ఈ చర్యలు తీసుకున్నట్టు దళిత వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.