పాముకాటుతో మహిళ మృతి విషయం తెలుసుకుని సహాయం అందించిన అంబుల వైష్ణవి మండలంలోని శ్రీహరిపురం

ఏలూరు జిల్లా ముదినేపల్లి::::: పాముకాటుతో మహిళ మృతి విషయం తెలుసుకుని సహాయం అందించిన అంబుల వైష్ణవి మండలంలోని శ్రీహరిపురం గ్రామంలో గల నిరుపేద కుటుంబానికి చెందిన 25 సంవత్సరాలు గల ఆరే అంజలి పాము కాటుకు గురై మృతి చెందగా విషయము తెలిసి వైద్య విద్యార్థిని మాజీ బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి మట్టి ఖర్చులకు గాను పదివేల రూపాయలు ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు మృతురాలి భర్త ఆమెతో సహజీవనం చేయకుండా వదిలేసిన మీదట ఒంటరిగా ఉంటూ ఐదు సంవత్సరాలు మరియు మూడు సంవత్సరాలు వయస్సు కల్గిన చిన్నారు బాలికలు వున్నారని, వాళ్ళని చూసుకొంటూ కూలి పనులు చేస్తూ జీవనమని పూరిగుడిసెలో ఉంటూ గ్రామస్తుల తలలో నాలుకగా మసాలుకొంటూన్న అంజలి చిన్నారులని స్కూల్ కి పంపించి వద్దామని బీరువాలోని బట్టలు తీస్తుండగా బట్టలలోకి పాము ఎప్పుడు దురిందో తెలియనందున బట్టలు తీస్తున్న సమయములో పాము కరచినందున మృతి చెంది ఉంటుందన్ని,అక్కడివారు డాక్టర్ మనోజ్ కి తెలియపరిచారు చిన్నారులకి కుటుంబ నీడ కరువై బరువెక్కిన భాదా హృదయాలతో గ్రామస్తులు, బంధువులు సొకసముద్రంలో మునిగి అంతిమ యాత్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొని మానవత్వం చాటుకున్నారు భవిష్యత్తులో చిన్నారుల విద్యకు గాని వారి జీవనానికి సంబంధించి ఏ అవసరం వచ్చినా ఆర్థిక సహాయం చేయగలవారమని అంబుల వైష్ణవి వారి తండ్రి డాక్టర్ మనోజులు బంధుమిత్రులకు మరియు గ్రామస్తులకు ధైర్యాన్ని కల్పించారు అరే అంజలి ఆత్మకు శాంతి కలగాలని, తల్లి అసిీసులతో చిన్నారుల జీవితాలు బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తూ మనస్ఫూర్తిగా కోరుకున్నారు